Cricket Betting : క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి..!
ప్రధానాంశాలు:
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి..!
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఈ బెట్టింగ్ కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటికే ఈ బెట్టింగ్ దెబ్బకు చాలామంది ప్రాణాలు విడువగా..తాజాగా మరో యువకుడి ప్రాణం పోయింది. బెట్టింగ్‌లో రూ.2 లక్షలు కోల్పోయిన సోమేశ్ అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై, చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైలు పట్టాలపై నిలబడి తన స్నేహితుడితో చివరిగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. బెట్టింగ్ వ్యసనానికి యువత బలవుతున్న తీరు నేటి సమాజానికి ఒక పెద్ద హెచ్చరికగా ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.

Cricket Betting : క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి..!
సోమేశ్ రైలు పట్టాలపైకి వెళ్లిన సమయంలో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. “నాకు బ్రతకడం ఇష్టం లేదు.. బెట్టింగ్‌లో కోల్పోయిన డబ్బు తిరిగి చెల్లించలేను” అంటూ బాధతో చెప్పాడు. ఇది విన్న అతని స్నేహితుడు భయంతో కంగారుపడిపోయాడు. “ప్లీజ్ చావొద్దురా.. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.. నీ జీవితానికి విలువ తెలుసుకో” అంటూ బతిమాలాడు. కానీ అప్పటికే మనస్తాపం చెంది ఆత్మహత్య నిర్ణయించుకున్న సోమేశ్, స్నేహితుడి మాటలను విస్మరించాడు.
ఈ ఘటన మరోసారి బెట్టింగ్ వ్యసనానికి బలయ్యే యువత గురించి ఆలోచించేలా చేస్తోంది. క్రికెట్ బెట్టింగ్ యువతను ఆర్థికంగా, మానసికంగా నాశనం చేస్తోంది. అక్రమ బెట్టింగ్ రాకెట్‌లను అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసు శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే యువత కూడా అలాంటి మార్గాల్లో అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితానికి మించినది ఏదీ లేదని, ఓటమి అనంతరం విజయాన్ని సాధించవచ్చని యువతలో అవగాహన పెంచాలి. అప్పుడే ఇలాంటి విషాదకర ఘటనలు నివారించగలుగుతాం.