YS Jagan : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి వైయస్ జగన్, వైఎస్ భారతి వెళతారా.. లేదా..?
ప్రధానాంశాలు:
YS Jagan : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి వైయస్ జగన్, వైఎస్ భారతి వెళతారా.. లేదా..?
YS Jagan : ఏపీ ఎన్నికల్లో అన్నా చెల్లెలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల కీలకంగా మారారు .కారణాలు ఏవైనా వైయస్ షర్మిల వైఎస్ జగన్ మధ్య ఉన్న గొడవలు నేపథ్యంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం యాదృచ్ఛికంగా మారింది. ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. వైఎస్ రాజారెడ్డి వివాహానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అన్నది పెద్ద చర్చనీయాంశమైంది. అయితే వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థానికి వైయస్ జగన్ వెళ్లారు. వైయస్ షర్మిల తన అన్నను రిసీవ్ చేసుకున్నారు. ఇక గ్రూప్ ఫోటోలలో వైయస్ జగన్ ముఖ భావంగా కనిపించారు. బ్రదర్ అనిల్, వైయస్ షర్మిల పవన్ కళ్యాణ్ లాంటివారు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ జగన్ వరకు వచ్చేసరికి పేస్ లో కొంచెం డల్నెస్ కనిపించింది.
ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో వైఎస్ జగన్ వైయస్ షర్మిల మధ్య అనుబంధం కనిపించలేదు. ఎంగేజ్మెంట్ జరిగిన వారం తర్వాత వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ప్రజల్లోకి బహిరంగ సభలు పెట్టి నిజ నిజాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ రాజారెడ్డి వివాహం జరగబోతుంది. అయితే ఈ పెళ్లికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి కలిసి వెళ్తారా లేదా అన్నది ప్రశ్న. ఈ పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లా చేస్తున్నారు. దానికి వైయస్ జగన్ వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పెళ్ళికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే పరిస్థితి కనబడటం లేదని కొందరు అంటున్నారు.
అయితే వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 18న జరగనుంది. ఇదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ‘ సిద్ధం ‘ ముగింపు సభ జరగనుంది. ఈ సిద్ధం సభలను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభలకు జనాలు బాగా తరలివచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా కూడా జరిగాయి. అయితే ఆ సభలకు ముగింపు రాప్తాడులో వైయస్ జగన్ ప్లాన్ చేసుకున్నారు. ఆ సభలో వైయస్ జగన్ ప్రజలకు కీలక హామీలను పెట్టబోతున్నారని తెలుస్తోంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫిబ్రవరి 18న వైయస్ రాజారెడ్డి వివాహానికి వైయస్ జగన్ వెళ్లడం లేదని, ఆయన భార్య వైయస్ భారతి రెడ్డి మాత్రమే వెళతారని వార్తలు వస్తున్నాయి.