
Ys Jagan : జగన్ పెద్ద తప్పిదమే చేస్తున్నారా.. అలా చేస్తే పరువు అంతా గంగలో కలిసినట్టే..!
Ys Jagan : గత కొద్ది రోజులుగా జగన్, వైఎస్ షర్మిళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. షర్మిళ వలన జగన్ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. ఆమె వల్లనే జగన్ ఈ సారి ఎన్నికలలో ఓడిపోయాడనే ప్రచారం కూడా ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య పొలిటికల్ వార్ కాస్తా ప్రాపర్టీ వార్ గా మారుతోంది. గత ఎన్నికల్లో ఇద్దరూ పరాజయం పాలైన తర్వాత ఒకరినొకరు కలిసిన దాఖలాలు లేవు. కాని ఇద్దరి మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలు మాత్రం ఇప్పుడు బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. దీనికి కౌంటర్ గా వైఎస్ షర్మిల కూడా ఓ లేఖను విడుదల చేశారు.
ఎపుడో 2019 ఆగస్టులో జగన్ తనకు చెందిన సరస్వతి పవర్ కంపెనీలో కొన్ని షేర్లను తన సోదరి షర్మిలకు అలాగే తల్లి విజయమ్మ పేరున బదిలీ చేస్తూ జగన్ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారని అంటున్నారు. అయితే ఇది జగన్ బెయిల్ కి సంబంధం ఉన్న ఇష్యూగా చెబుతున్నారు. సొంత తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మీద్ జగన్ కోర్టుకు వెళ్ళడంతో ఆయన ఇమేజ్ కి రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయన్న కోణంలో కూడా చర్చ వైసీపీలో మొదలైంది. దాంతో ఆ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు వైసీపీ వెంటనే ఈ బెయిల్ కుట్ర ఉందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టింగులతో హల్ చల్ చేస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా వైఎస్సార్ కుటుంబం ఇపుడు నిట్టనిలువుగా చీలిపోయింది అన్నది అందరికి అర్ధమవుతుంది.
Ys Jagan : జగన్ పెద్ద తప్పిదమే చేస్తున్నారా.. అలా చేస్తే పరువు అంతా గంగలో కలిసినట్టే..!
చెల్లెలు మేటర్ ఎలా ఉన్నా కూడా జగన్ తన తల్లి విజయమ్మ విషయంలో కోర్ట్ కి వెళతాడనే వార్త ఇప్పుడు వైసీపీ నాయకులని కలవరపెడుతుంది. జగన్ మీద ప్రత్యర్ధులు ఇపుడు అదను చూసి ఇబ్బందులు పెట్టేందుకు కాచుకుని ఉన్నారని అందులో తెలిసో తెలియకుండానే కుటుంబ సభ్యులు కూడా జత కలుస్తున్నారు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే అదేమీ లేదని రాజకీయంగా తనకు ఎదురుగా ప్రత్యర్ధిగా ఉండడమే కాకుండా ఇటీవల ఎన్నికల్లో తన ఓటమికి ఒక కారణంగా తయారు అయిన వైఎస్ షర్మిల మీద ఆగ్రహంతో జగన్ చేసిన ఈ పని వల్ల విజయమ్మని సైతం ఇరికించారని అంటున్నారు. చూస్తుంటే జగన్ అనవసరంగా కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.