Ys Jagan : కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా.. వారిలో అనుమానాలు..!
ప్రధానాంశాలు:
Ys Jagan : కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా.. వారిలో అనుమానాలు..!
Ys Jagan : ఏపీలో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో పార్టీల భవితవ్యం ఉంది. కౌంటింగ్ కు ఇంకా సమయం ఉంది. ఈ లోగా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ప్రజలను బలంగా నమ్ముకుంటున్నారు. తాను చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం కేవలం జగన్ మీద ఉన్న వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటున్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకతనే తమకు అధికారాన్ని కట్టబెడుతుందని బలంగా నమ్ముతున్నారు. అంటే ఇక్కడ జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది.
Ys Jagan జగన్ ఒక్కడే..
జగన్ తాను చేసిన పనులను నమ్ముకుంటున్నారు, కానీ చంద్రబాబు జగన్ మీద ఉన్న వ్యతిరేకతను నమ్ముకుంటున్నారు. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రం జగన్ ఒక్కడే స్పందించాడు. వైసీపీ భారీ సీట్లతో అధికారంలోకి రాబోతోందని తెలిపాడు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. జగన్ ఒక్కడే గతం కంటే అధికంగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాన్ లో మాత్రం ఒక భయం వెంటాడుతోంది. జగన్ అంత గట్టిగా చెప్పాడంటే అందులో చాలా వరకు నిజమే ఉంటుందని వారి భయం.

Ys Jagan : కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా.. వారిలో అనుమానాలు..!
ఎందుకంటే జగన్ బలమైన ఆధారం లేకుండా ఏదీ మాట్లాడడు కదా అని వారు అంటున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో గతం కంటే ఓటింగ్ పెరిగింది. అది తనకు అనుకూలమైన ఓటింగ్ అని జగన్ నమ్ముతున్నారు. ఈ సారి పెద్ద మార్పు ఓటింగ్ రూపంలో కనబడబోతోందని చెబుతున్నారు జగన్. అదే ఇప్పుడు కూటమి నేతల్లో అనుమానాలు పెంచుతోంది. ఎందుకంటే జగన చెప్పినట్టు అది కూటమి నేతలకు అనుకూలంగా వేసిన ఓటు కాదని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా చెప్పుకోవడానికి పెద్దగా చేసిన పనులు ఏమీ లేవని ఆయనకు తెలుసు.అందుకే ఇప్పుడు జగన్ ధీమాను చూసి వారు భయపడుతున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు వారంతా సైలెంట్ గా ఉండి ఫలితాలు ఏం వస్తాయో అని ఎదురు చూస్తున్నారు.