YS Jagan VS Alla : జగన్ ను తక్కువ అంచనా వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జగన్ చేసిన పనికి బిత్తరపోయిన ఆళ్ల
ప్రధానాంశాలు:
ఆళ్ల రాజీనామాకు అసలు కారణం ఏంటి?
నాన్ బీసీకి ఎందుకు జగన్ టికెట్ ఇచ్చారు?
ఇప్పుడు గంజి చిరంజీవిని ఎందుకు ఇన్ చార్జిగా నియమించారు?
YS Jagan VS Alla : ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్ టాపిక్ అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా. ఆయన తన ఎమ్మెల్యే పదవికి మాత్రమే కాదు.. వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. తన పర్సనర్ రీజన్స్ వల్లనే తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని.. త్వరలోనే రాజీనామా చేయడానికి గల కారణాలు వెల్లడిస్తానని ఆళ్ల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఆళ్ల రాజీనామాపై పెద్దగా స్పందించలేదు. దానికి కారణం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చే పనిలో పడ్డారు జగన్. కనీసం 80 నుంచి 90 వరకు టికెట్లు మార్చాలని, సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో మంగళగిరి కూడా ఒకటి. కానీ.. ఇలా సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోవడం పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు నేతలు అధిష్ఠానానికి ఎదురు తిరుగుతున్నారు. మరికొందరు ఆళ్లలా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవిని నియమించాలని అనుకోవడమే అసలు ఆళ్ల రాజీనామాకు కారణం అనేది తెలుస్తోంది. నిజానికి నారా లోకేష్ ను ఓడించి ఆళ్ల ఎమ్మెల్యే అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరోవైపు ఆళ్లకు, జగన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ.. వైసీపీ అధిష్ఠానాన్ని విమర్శించే స్థాయి ఆళ్లకు లేదని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు కూడా పార్టీ నేతలను కలుపుకొని ముందుకు వెళ్లలేదని.. అలాగే మంగళగిరి బీసీ సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గం. అక్కడ బీసీల ప్రాతినిథ్యం ఎక్కువ. అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలవాలంటే బీసీ సామాజికవర్గ నేతలకే టికెట్ కేటాయించాలని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే ఆళ్లను జగన్ పక్కన పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం తెలిసే ఆళ్ల పార్టీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
YS Jagan VS Alla : స్థానిక నాయకులు నాన్ బీసీకి టికెట్ ఇవ్వొద్దని వేడుకున్నారు
అప్పట్లో మంగళగిరి నుంచి ఆళ్లకు టికెట్ ఇవ్వొద్దని.. బీసీకే టికెట్ ఇవ్వాలని, నాన్ బీసీలకు టికెట్ ఇవ్వొద్దని అన్నా కూడా తనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆళ్లకు టికెట్ ఇచ్చారు జగన్. కానీ.. ఆయన గెలిచిన తర్వాత స్థానిక నాయకులతో గొడవలు పెట్టుకోవడం, స్థానిక నాయకులతో కలుపుకొని పోకపోవడం అనేది ఆళ్లకు మైనస్ అయింది. అదే ఇప్పుడు జగన్ ను ఆళ్లకు దూరం చేసింది.