YS Jagan : జగన్ ఖచ్చితంగా అర్ధం చేసుకోవాల్సిన పాయింట్ ఇది.. జగన్ ఫ్యాన్స్ తరఫు నుంచి బిగ్ న్యూస్..!
YS Jagan : ఏపీని బీజేపీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే కదా. ఏపీలో బీజేపీ జాతీయ నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి సభలో బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. వైజాగ్ వేదికగా కూడా సీఎం జగన్ పై విమర్శనాస్త్రం సంధించారు. అసలు ఏపీలో అంత ఘోరమైన పాలన సాగుతోందా? ఏపీని ఓవైపు సీఎం జగన్ ఎంతో అభివృద్ధి చేస్తుంటే.. ఎందుకు వీళ్లు టార్గెట్ చేసినట్టు.
సీఎం జగన్ ఒకవైపు ఏపీని అభివృద్ధి చేస్తున్నారు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. అయినా.. బీజేపీ ఎందుకు టార్గెట్ చేసినట్టు. అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరు ఎందుకు వైసీపీని టార్గెట్ చేసినట్టు. అసలు ఏపీని మేము ఎక్కడ అభివృద్ధి చేస్తున్నామో, ఎలా అభివృద్ధి చేస్తున్నమో ఎందుకు వైసీపీ నేతలు చెప్పుకోవడం లేదు అనేదే ఇక్కడ కీలకం.బీజేపీ నాయకులు నేరుగానే సీఎం జగన్ ను నిందిస్తున్నారు. డైరెక్ట్ గానే వైసీపీ పాలనను ఏపీకి వచ్చి మరీ విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారు. బీజేపీ నేతల విమర్శలను వైసీపీ నేతలు కాకపోతే కనీసం సీఎం జగన్ అయినా విమర్శించాలి కదా. ఆయన స్పందన ఘాటుగా ఉండాలి కానీ..
YS Jagan : బీజేపీ నాయకుల విమర్శలను సీఎం జగన్ ఎందుకు తిప్పి కొట్టడం లేదు
ఆయన స్పందన మాత్రం అంత ఘాటుగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా విద్య కానుక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. బీజేపీ విషయంలో చాలా సున్నితంగా మాట్లాడారు. బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చు అంటూ మాట్లాడారు. అందుకే నేను వాళ్లను నమ్ముకోలేదని, ప్రజలే తన సైన్యం అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఆయన సైన్యం సరే.. కాదని ఎవరు అనుకున్నారు కానీ.. సీఎం జగన్ బీజేపీని నమ్ముకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు కదా. ఎందుకు జగన్ ఈ చిన్న విషయాన్ని మరిచిపోయారు అని అంటున్నారు. ఏపీని అభివృద్ధి చేసినప్పుడు నిఖార్సయిన సమాధానం చెప్పాలి. కానీ.. బీజేపీని విమర్శించే విషయంలో ఎందుకు సీఎం జగన్ ఇలా ప్రవర్తిస్తున్నట్టు అనేది స్పష్టం కావడం లేదు.