YS Jagan : జగన్ ఎప్పటినుంచో కలలు కంటున్న విజయం ఇది..!
YS Jagan : ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సూపర్ డూపర్ స్పీడ్ లో ఉంది. సుప్రీం కోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. జగన్ సర్కార్ కు తిరుగులేని విజయం దక్కింది. పేదల ఇళ్ల స్థలాలపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. అమరావతి క్యాపిటల్ రీజియన్ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది.కానీ.. పేదల కోసం ఆర్ 5 జోన్ ను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేస్తే దానిపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది టీడీపీ పార్టీ. దానికి సంబంధించిన తీర్పు తాజాగా వెలువడింది.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై విచారణ చేపట్టిన జోసెఫ్, అరవింద్ ధర్మాసనం ఇళ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఏపీ హైకోర్టు కూడా ఆర్ 5 జోన్ ను సమర్థించింది. ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్పష్టం చేసింది. కానీ.. సుప్రీంలోనూ పిటిషన్ దాఖలు అయింది. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా చట్టం ప్రకారం ఐదు శాతం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని..
YS Jagan : హైకోర్టు ఆదేశాలనే ఉటంకించిన సుప్రీం
ఆ హక్కు ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. ఇది జగన్ సర్కారుకు భారీ విజయం అని చెప్పుకోవాలి. దీని వల్ల 51 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగుమమైంది. ఆయా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తోంది. ఆ ప్రక్రియ వేగవంతం అయింది. ఇక.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష నేతలకు ఇది చెంపపెట్టు అనే చెప్పుకోవాలి.