YS Jagan : వామ్మో.. జగన్ ను అంచనా వేయడం ఎవరి తరం కాదు.. ఆ మంత్రులకు అంత పెద్ద షాక్ ఇస్తున్నాడా?
YS Jagan ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే 2024 ఎన్నికల హడావిడి మొదలైపోవడం ఖాయం. ఇప్పుడు డిసెంబర్లో కేబినెట్ ప్రక్షాళనకు జగన్
సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు, కొత్త, పాత ఇలా వందలాది లెక్కలతో గన్ రాబోయే కేబినెట్ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేసుకోవాలని వైసీపీ
అధినేత కమ్ సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారందరికీ తమకు ఆ పదవులు రావడానికి కారణమైన పార్టీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత పెట్టనున్నారు. దీంతో మంత్రులకు అప్పగించనున్న పార్టీ బాధ్యతలపైనా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఎవరికే ఏ బాధ్యతలు దక్కనున్నాయి, వాటికి వారు ఏమాత్రం న్యాయంచేస్తారు అనే దానిపైనా చర్చ జరుగుతోంది.
YS Jagan మంత్రులకు ఎంపీల గెలుపు బాధ్యత
మాజీలకు పార్టీ పార్లమెంటరీ జిల్లాల ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ పార్లమెంటరీ జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతల్ని ఈ మంత్రులు తమ భుజాలపై వేసుకుని తదుపరి కార్యక్రమాలు
చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల గెలుపు బాథ్యత వీరిదే. ఇందుకోసం పార్టీకి ఇప్పటికే ఉన్న ప్రాంతీయ ఇన్ ఛార్జ్ ల కన్నుసన్నల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా 25 మంది మంత్రులు రాబోతున్నారు. వీరందరికీ కూడా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. వీరందరికీ తమ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల గెలుపు బాధ్యతను అప్పగించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీల గెలుపు బాధ్యత కాబోయే మంత్రులదే అవుతుంది. దీంతో వీరంతా మంత్రులు కావడం తోటే ఆయా ఎంపీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ 2024లో వీరి గెలుపుకు దోహదపడాల్సి ఉంటుంది. కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తాజాగా ఎంపీలతో నిర్వహిస్తున్న సమీక్షల్లో జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయా ఎంపీల్ని రేపు 2024 ఎన్నికల్లో గెలిపించాల్సింది వీరే కాబట్టి . వచ్చే ఎన్నికల్లో ఎంపీలు తమను గెలిపించే సత్తా ఉన్న వారినే కాబోయే మంత్రులుగా సిఫార్సుచేయనున్నారట.
YS Jagan ఈ నిర్ణయం వెనుక పీకే..?
దీంతో ఈ వ్యవహారం కూడా వైసీపీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రస్తుత మంత్రులు ఎంపీల్ని పట్టించుకోవడం లేదు. చాలా నియోజకవర్గాల్లో వారిని కాలుమోపనీయడం లేదు. ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల ఎంపీల జోక్యాన్ని సహించడం లేదు. దీంతో ఈ సమన్వయం కోసమే ఈసారి ఎంపీలు చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతుండటం, వీరి మధ్య విభేధాలు రేపు 2024 ఎన్నికల్లో వైసీపీ పుట్టి ముంచే ప్రమాదముందన్న సంకేతాలు వస్తుండటం, నిఘా, సర్వే నివేదికల నేపథ్యంలో జగన్..
తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి వచ్చే ఏడాది నుంచి వైసీపీ గెలుపు కోసం మరోసారి రంగంలోకి దిగనున్న ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో విభేధాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న పీకే సలహా మేరకే జగన్ ఈ దిశగా అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.