YS Jagan : విపక్షాలకి చెక్ పెడుతూ MASTER PLAN తో దిగిన జగన్ !
YS Jagan : ఒక్కసారి ఏపీ రాజకీయాలను చూస్తే అసలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అసలు.. ప్రతిపక్ష పార్టీలయితే అస్సలు ఆగడం లేదు. ఇప్పటి నుంచే రచ్చ రచ్చ చేస్తున్నాయి. పాదయాత్రలు, వారాహి యాత్రలు అంటూ బిజీ అయిపోయాయి. తామేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏకంగా మినీ మేనిఫెస్టోనే ప్రకటించేశారు.
ఒకే ఒక్క వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు కూడా వెనుకాడటం లేదు. అందుకే.. ఎన్నికలు ఏపీలో సరికొత్త మలుపు తీసుకుంటున్నాయి. విపక్షాలన్నీ ఏకమై వైసీపీ ఓడించేందుకు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. కానీ.. అధికార పార్టీ మాత్రం సింహం సింగిల్ గా వస్తుంది అన్న చందంగా సింగిల్ గానే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అమరావతిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. అందుకే అధికార వైసీపీ కూడా అదే అమరావతిపై మాస్టర్ స్కెచ్ తో ముందుకు రాబోతోంది.నిజానికి మూడు రాజధానులు అనేవి ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా తీసుకోనటువంటి డేర్ స్టెప్. కానీ.. ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో ప్రతిపక్షాలకు మూడు రాజధానుల అంశం ఒక ఆయుధంగా మారి.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వాడుకుంటున్నారు.
YS Jagan : ఇంకా పెండింగ్ లోనే మూడు రాజధానుల అంశం
అందుకే ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదని.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నగరాలు, పట్టణాల నవీకరణకు కసరత్తు ప్రారంభించింది. దాని కోసం ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. విజయవాడ, అమరావతిని కలుపుతూ మెట్రో పాలిటన్ నగరంగా మార్చే ప్రతిపాదనపైన ప్రస్తుతం చర్చిస్తున్నారు. వైజాగ్ నే అభివృద్ధి చేస్తున్నారు అనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకే విజయవాడ, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేసి టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కంటే బెటర్ గా అభివృద్ధి చేసి చూపించాలని సీఎం జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు పడుతున్నాయి.