Ys Jagan
Ys Jagan : ఏపీ ప్రభుత్వంకు హై కోర్టులో ఇప్పటి వరకు ఎన్ని మొట్టి కాయలు పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంను హెచ్చరించని విధంగా పదే పదే హైకోర్టు ఏపీ ప్రభుత్వంను హెచ్చరించడంతో పాటు పలు సార్లు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉన్న కారణంగా వైఎస్ జగన్ అడుగు ముందుకు వేయలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితి రావడంకు కారణం కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న వారు పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు. వారి వల్ల ప్రభుత్వంకు పదే పదే వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. వారు కనుక మంచి వాదనలతో ప్రభుత్వం తరపున వాదించి ఉంటే ఇన్ని సార్లు వ్యతిరేక తీర్పులు వచ్చేవి కావు అనేది ప్రభుత్వ వర్గాల వారి టాక్. అందుకే ప్రభుత్వం వారిని తప్పించాలనే యోచన చేస్తుందట.
రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో కూడా వాదించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున లాయర్ లు ఉంటారు. ప్రభుత్వం అధికారికంగా మొత్తం 15 మంది సీనియర్ లాయర్ లను కలిగి ఉంటుంది. కాని వారిలో ఒక్కరు ఇద్దరు తప్ప మరెవ్వరు కూడా సీరియస్ గా ప్రభుత్వం కోసం పని చేస్తున్నట్లుగా అనిపించడం లేదు అంటూ మంత్రులు అంటున్నారు. ఇదే విషయాన్ని వారు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ వద్ద ప్రస్థావించారు. సీఎం వైఎస్ జగన్ కూడా వారిపై అసంతృప్తితో ఉండటం వల్ల త్వరలోనే వారి మార్పు తద్యం అంటున్నారు. మొత్తం 15 మందిలో కనీసం 10 నుండి 12 మంది కొత్త వారు వస్తారని అంటున్నారు. ప్రభుత్వంతో ఆ లాయర్ ల ఒప్పందం పూర్తి కావస్తున్న నేపథ్యంలో కొత్త వారిని రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ys jagan mohan reddy
మూడు రాజధానుల విషయం మొదలుకుని మొన్నటి నిమ్మగడ్డ రమేష్ విషయం వరకు ప్రతి ఒక్క కేసులో కూడా ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఇంకా కొన్ని కేసులు కూడా ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా పాత అడ్వ కేట్ లను కొనసాగిస్తే ముందు ముందు మరింతగా నష్ట పోవాల్సి వస్తుందని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే విసిగి పోయిన వైఎస్ జగన్ ఇప్పుడు వారిని తప్పించి కొత్త టీం ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. మరి కొన్ని వారాల్లోనే కొత్త లా టీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరి ముందు ముందు అయినా జగన్ కు కోర్టులో మొట్టికాయలు తప్పుతాయేమో చూడాలి.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.