YS Jagan : రోజాని ఏడిపించిన బండారిని చెప్పుతో కొట్టినా తప్పులేదు.. సీఎం జగన్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : రోజాని ఏడిపించిన బండారిని చెప్పుతో కొట్టినా తప్పులేదు.. సీఎం జగన్ ఫైర్

 Authored By kranthi | The Telugu News | Updated on :14 October 2023,1:00 pm

YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు సీఎం జగన్ పాల్పడ్డారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ కాస్త యూటర్న్ తీసుకొని అది రోజా వైపు మళ్లింది. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన రోజాపై బండారు సత్యనారాయణ ఫైర్ అవడంతో ఆ ఇష్యూ కాస్త సీరియస్ అయింది. ఈ ఘటనపై తాజాగా సీఎం జగన్ కూడా స్పందించారు. గతంలో చంద్రబాబు పాలన గురించి అందరికీ తెలుసు. 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చిన పాపాన పోలేదు ఆ మనిషి. ఈరోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ పెద్ద మనిషి చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల సంపద ఉంది కానీ.. ఈ పెద్ద మనిషికి సంపద ఉంది కానీ.. కుప్పంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో పాలన చేశాడు.. అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.

కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పుకొచ్చారు. ఆ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఈ పెద్ద మనిషి 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. మూడు సార్లు సీఎంగా చేశాడు. అయినా కూడా అక్కడ పేద వాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అంటే.. ప్రతి పేద వాడి గడపకు మంచి జరగాలి అంటే.. అది జరిగింది ఎప్పుడు అంటే.. అది మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ.. ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ.. రాష్ట్రం మీద కానీ.. కుప్పం ప్రజల మీద గానీ.. ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు. అనురాగం లేదు. బాధ్యత లేదు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయి.. ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో కానీ.. కుప్పంలో కానీ ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు.

ys jagan reacts over bandaru satyanarayana comments on roja

#image_title

YS Jagan : చంద్రబాబు సొంతిల్లు ఎక్కడుందో తెలుసా?

చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది అంటే.. పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది. అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం. ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్లు అవుతోంది. చంద్రబాబు అనే వ్యక్తి కంటిన్యూగా ఒక్క నెల అయినా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయండి. అందరినీ కోరుతున్నా.. అందరూ ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రం ఆయనకు కానీ.. ఆయన్ను సమర్థించే వారికి కానీ.. ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా ఆలోచన చేయండి.. అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది