Ys jagan : గుడివాడలో కొడాలి నాని పై దద్దరిల్లిన సీఎం జగన్ స్పీచ్..!!
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో మలయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8 వేలకు పైగా టీడ్కో ఇళ్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు… ఊరులని అన్నారు. వీటిని నిర్మాణంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేసినట్లు స్పష్టం చేశారు. ఈ కాలనీలో దాదాపు 16 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తాయని స్పష్టం చేశారు.
అప్పట్లో ప్రతిపక్ష నేతగా గుడివాడలో ఇచ్చిన హామీని.. తాజాగా నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఇంటి స్థలం విలువను రెండున్నర లక్షల రూపాయలనుకున్న.. ఇల్లు కట్టడానికి ₹2.70 లక్షల ఖర్చు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణానికి లక్షల రూపాయల ఖర్చు వేసుకున్న ప్రతి ఇంటి విలువ దాదాపు పది లక్షల రూపాయలు అవుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే గుడివాడ లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడని.. పేదవాడికి ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదంటూ.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రెండు దశల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది. ₹75 వేల కోట్ల రూపాయల ఆస్తులను పట్టల రూపంలో ఇచ్చినట్లు సీఎం జగన్ వివరించడం జరిగింది. జులై 8వ తారీకు వైయస్సార్ జయంతి నాడు మరో నాలుగు వేళ్ళ పట్టాల స్థలాలను ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.