YS Jagan : ముద్రగడని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వాడుతున్న జగన్.. పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే చెక్ మేట్..!
YS Jagan : ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రూట్ ఎటువైపు అనేది త్వరలోనే స్పష్టం కానుంది. ముద్రగడ పద్మనాభం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీలో చేరి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన చర్చలే నడుస్తున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో చర్చలు జరుపుతున్నారు. సీఎం జగన్ కూడా ఆయన పార్టీలో చేరికపై సుముఖత చూపిస్తున్నట్టు సమాచారం. ఆయన వైసీపీలో చేరితే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమాచారాన్ని ముద్రగడకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేరవేశారు.
ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడతారా.. లేదా.. ఇష్టపడకపోతే ఆయన కొడుకుకి అయినా టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ముద్రగడ, ఆయన కొడుకు ఇద్దరూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోతే ఎలా.. అప్పుడు వాళ్లలో ఎవరికైనా అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి పార్టీ సిద్ధం అని తెలుస్తోంది. ముద్రగడకు ఆ ఆఫర్ నచ్చడంతో తాను పోటీ చేసే విషయంపై తన ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వైసీపీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
YS Jagan : వైసీపీ నేతలతో టచ్ లోనే ఉన్న ముద్రగడ
నిజానికి వైసీపీ నేతలతో ముద్రగడ ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నారు. నిజానికి.. గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ బలపడుతోంది. అందుకే జనసేన పార్టీని ఎదుర్కోవడానికి ముద్రగడను వాడుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ కాపు నేత కావడం.. కాపులు ముద్రగడకు మద్దతు ఇస్తుండటంతో జనసేనకు మద్దతుగా ఉన్న కాపులను తనవైపునకు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తోంది. అందుకే.. ముద్రగడకు ఎలాంటి సీటు ఇవ్వడానికి అయినా రెడీ అన్నట్టుగా సీఎం జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులను తన వైపునకు తిప్పుకుంటేనే వైసీపీకి గోదావరి జిల్లాలు అనుకూలంగా మారుతాయని ముద్రగడ వైపు సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.