YS Sharmila : తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో బిజీ అయింది. ఇంకో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయాత్తం అవుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా దూకుడు మీదుంది.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతి రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. దర్యాప్తు వేగంగా చేసి దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డ్ ను రద్దు చేయడం కోసం రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేలా చూసి నిరుద్యోగులను ఆదుకోవాలని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో షర్మల కోరారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను పేపర్ లీకేజీ వ్యవహారం కుదిపేసిందని.. ఇది అతి పెద్ద స్కామ్ అని లేఖలో పేర్కొన్నారు. సంతలో సరుకులు అమ్మినట్టుగా కీలకమైన పరీక్ష పేపర్లను అమ్మి 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పేపర్ లీకేజీ వెనుక బోర్డ్ చైర్మన్, ఉద్యోగుల నుంచి రాష్ట్ర మంత్రుల హస్తం ఉందంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ పత్రాలు లీక్ కావడం అనేది ఎంత పెద్ద స్కామో తెలుస్తోంది అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.