YS Sharmila : తెలంగాణ గవర్నర్ తో కలిసి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : తెలంగాణ గవర్నర్ తో కలిసి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన

YS Sharmila : తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో బిజీ అయింది. ఇంకో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయాత్తం అవుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా దూకుడు మీదుంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతి రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 April 2023,3:00 pm

YS Sharmila : తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో బిజీ అయింది. ఇంకో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయాత్తం అవుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా దూకుడు మీదుంది.

ys sharmila letter to telangana governor

ys sharmila letter to telangana governor

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతి రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. దర్యాప్తు వేగంగా చేసి దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

YS Sharmila meets Telangana Governor, requests imposition of President's  rule in state - India Today

YS Sharmila : తెలంగాణ గవర్నర్ కు షర్మిల లేఖ

ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డ్ ను రద్దు చేయడం కోసం రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేలా చూసి నిరుద్యోగులను ఆదుకోవాలని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో షర్మల కోరారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను పేపర్ లీకేజీ వ్యవహారం కుదిపేసిందని.. ఇది అతి పెద్ద స్కామ్ అని లేఖలో పేర్కొన్నారు. సంతలో సరుకులు అమ్మినట్టుగా కీలకమైన పరీక్ష పేపర్లను అమ్మి 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పేపర్ లీకేజీ వెనుక బోర్డ్ చైర్మన్, ఉద్యోగుల నుంచి రాష్ట్ర మంత్రుల హస్తం ఉందంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ పత్రాలు లీక్ కావడం అనేది ఎంత పెద్ద స్కామో తెలుస్తోంది అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది