YS Sharmila : పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ.. నవంబర్ 4న నామినేషన్.. పాలేరులో టఫ్ ఫైట్ | The Telugu News

YS Sharmila : పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ.. నవంబర్ 4న నామినేషన్.. పాలేరులో టఫ్ ఫైట్

YS Sharmila : తెలంగాణ రాజకీయాల్లో పాలేరు రాజకీయాలు వేరు. పాలేరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పడింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్.. ఇప్పుడు వైఎస్సార్టీపీ నుంచి వైఎస్ షర్మిల పోటీ దిగుతుండటంతో.. అధికార పార్టీని ఢీకొని షర్మిల అక్కడ నిలదొక్కుకోగలదా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే.. షర్మిల ఈసారి పాలేరు నుంచి బరిలో దిగడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. షర్మిల […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 October 2023,12:10 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ నుంచి పాలేరు అభ్యర్థిగా పొంగులేటి బరిలో

  •  పొంగులేటితో ఢీకొట్టబోతున్న షర్మిల

  •  పాలేరుతో త్రిముఖ పోటీ

YS Sharmila : తెలంగాణ రాజకీయాల్లో పాలేరు రాజకీయాలు వేరు. పాలేరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పడింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్.. ఇప్పుడు వైఎస్సార్టీపీ నుంచి వైఎస్ షర్మిల పోటీ దిగుతుండటంతో.. అధికార పార్టీని ఢీకొని షర్మిల అక్కడ నిలదొక్కుకోగలదా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే.. షర్మిల ఈసారి పాలేరు నుంచి బరిలో దిగడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. షర్మిల పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్, నామినేషన్స్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం కోసం నామినేషన్ వేయనున్నారు. నవంబర్ 1 నుంచే ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతున్నా… తనను కాంగ్రెస్ లోకి రావాలని హైకమాండ్ రిక్వెస్ట్ చేసినా కొన్ని పరిస్థితులు అనుకూలించక షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయలేదు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తోనూ తన పార్టీని విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చించినా వర్కవుట్ కాలేదు. మరోవైపు పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావడంతో.. అతడితో సై అంటే సై అనబోతోంది షర్మిల. వైఎస్సార్టీపీ పార్టీకి తెలంగాణలో అంత బలం లేకున్నా.. పాలేరులో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే వైఎస్సార్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా.. పాలేరు నుంచి పొంగులేటి గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇటు షర్మిల కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో పాలేరులో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో పాలేరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...