Ys sharmila : జ‌గ‌న్‌ని తిడుతూ చంద్రబాబుకి విలువైన సూచ‌న చేసిన ష‌ర్మిళ‌.. అది ఏంటంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys sharmila : జ‌గ‌న్‌ని తిడుతూ చంద్రబాబుకి విలువైన సూచ‌న చేసిన ష‌ర్మిళ‌.. అది ఏంటంటే !

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys sharmila : జ‌గ‌న్‌ని తిడుతూ చంద్రబాబుకి విలువైన సూచ‌న చేసిన ష‌ర్మిళ‌.. అది ఏంటంటే !

Ys sharmila : గ‌త కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయం ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారిందో మ‌నం చూశాం. ప్ర‌చారం స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆ త‌ర్వాత తాము గెలుస్తామంటే తాము గెలుస్తామ‌ని కామెంట్స్ చేయ‌డం, అనంత‌రం స‌ర్వేలు, ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డం అందులో కూట‌మి భారీ విజ‌యం సాధించ‌డంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌ని ప్ర‌తి ఒక్క‌రు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా విషెస్ తెలియ‌జేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ‘చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము.

Ys sharmila లేఖ విడుద‌ల‌..

ఈ సందర్భంగా, గడిచిన వారంరోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదు, సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు, ఉండకూడదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేస్తున్నాము.

Ys sharmila జ‌గ‌న్‌ని తిడుతూ చంద్రబాబుకి విలువైన సూచ‌న చేసిన ష‌ర్మిళ‌ అది ఏంటంటే

Ys sharmila : జ‌గ‌న్‌ని తిడుతూ చంద్రబాబుకి విలువైన సూచ‌న చేసిన ష‌ర్మిళ‌.. అది ఏంటంటే !

గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీకున్న అనుభవముతో, మీరు పెద్దమనసు, నిస్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నాము. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నాము. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం అని లేఖ‌లో పేర్కొంది ష‌ర్మిళ‌.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది