Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..!

Chandranna Pellikanuka : ఏ పార్టీ అధికరం లోకి వస్తే వారు ఇచ్చే పథకాలకు పాత పేరు మార్చి కొత్త పేర్లను పెట్టడం జరుగుతూనే ఉంది. ఏపీ లో గత ప్రభుత్వం చాలా పథకాలకు వైఎస్సార్ పేరుని యాడ్ చేస్తూ పెట్టింది. ఐతే ఇప్పుడు ఆ పథకాల పేర్లు మార్చే పనిలో ఉంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని పథకాల పేర్లు మార్చగా లేటెస్ట్ గా మరో రెండు పథకాల పేర్లు మార్చేశారు. వైఎస్ జగన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..!

Chandranna Pellikanuka : ఏ పార్టీ అధికరం లోకి వస్తే వారు ఇచ్చే పథకాలకు పాత పేరు మార్చి కొత్త పేర్లను పెట్టడం జరుగుతూనే ఉంది. ఏపీ లో గత ప్రభుత్వం చాలా పథకాలకు వైఎస్సార్ పేరుని యాడ్ చేస్తూ పెట్టింది. ఐతే ఇప్పుడు ఆ పథకాల పేర్లు మార్చే పనిలో ఉంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని పథకాల పేర్లు మార్చగా లేటెస్ట్ గా మరో రెండు పథకాల పేర్లు మార్చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి కొత్తగా చంద్రన్న పెళ్లికానుక అని పెట్టారు. అదే కాదు మైనార్టీలకు జగన్ ఇస్తున్న విదేశీ విద్యా దీవెన పథకానికి కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం ఫర్ మైనార్టీస్ అని పెట్టారు. చంద్రన్న పెళ్లికానుక దారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్ధిక భరోసా ఇస్తున్నారు.

Chandranna Pellikanuka వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు

Chandranna Pellikanuka : వైఎస్సార్ కళ్యాణమస్తు కాస్త చంద్రన్న పెళ్లికానుకగా మార్పు..!

Chandranna Pellikanuka : పథకాల పేరు మార్పు తో ఏపీ ప్రభుత్వం

పేరు మార్చినా సరే పథకాల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు లక్ష ఇస్తుండగా.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు 1.20 లక్షల దాకా ఇస్తున్నారు. ఇక ఇదే విధంగా బీసీలకు 50 వేలు, కులాంతర వివాహాలకు 75 వేలు అందిస్తున్నారు. ఇక ఇదే స్కీం కింద మైనార్టీలకు లక్ష, దివ్యాంగులకు 1.50 లక్షలు ఇస్తున్నారు. ఐతే చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఏమైనా పెంచుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది