Kalyana Masthu Scheme : పిల్లల చదువు కోసం, బాల్య వివాహాల అడ్డుకట్ట కోసం కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలు.. హర్షిస్తున్న ప్రజలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalyana Masthu Scheme : పిల్లల చదువు కోసం, బాల్య వివాహాల అడ్డుకట్ట కోసం కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలు.. హర్షిస్తున్న ప్రజలు

Kalyana Masthu Scheme : పిల్లల చదువును ప్రోత్సహించడం కోసం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం కోసం, పేదింటి తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిని గౌరవప్రదంగా జరిపేందుకు జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని వందల కోట్లను ఖర్చు పెడుతోంది. ఇప్పటికే పిల్లల కోసం చాలా పథకాలు ఉన్నా.. ప్రత్యేకంగా వాళ్ల చదువును ప్రోత్సహించడం కోసం, వారి తల్లిదండ్రులకు సాయంగా ఉండటం కోసం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2023,10:30 am

ప్రధానాంశాలు:

  •  చదువును ప్రోత్సహించేలా వధూవరులు ఇద్దరికీ పదోతరగతి పాస్ తప్పనిసరి

  •  వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా స్కీమ్స్

  •  గత నాలుగు నెలల్లో రూ.81.64 కోట్ల సాయం

Kalyana Masthu Scheme : పిల్లల చదువును ప్రోత్సహించడం కోసం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం కోసం, పేదింటి తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిని గౌరవప్రదంగా జరిపేందుకు జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని వందల కోట్లను ఖర్చు పెడుతోంది. ఇప్పటికే పిల్లల కోసం చాలా పథకాలు ఉన్నా.. ప్రత్యేకంగా వాళ్ల చదువును ప్రోత్సహించడం కోసం, వారి తల్లిదండ్రులకు సాయంగా ఉండటం కోసం జగనన్న ఈ గొప్ప పథకాలను తీసుకొచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైస్సాఆర్ షాదీ తోఫా.. ఈ రెండు స్కీమ్స్ పేద తల్లిదండ్రులు వారి పిల్లల పెళ్లిని గౌరవప్రదంగా జరిపించేందుకు జగనన్న అందించే చేయూత అని చెప్పుకోవచ్చు.

జులై నుంచి అక్టోబర్ 2023 వరకు అంటే 4 నెలల మధ్య వివాహం చేసుకున్న అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించారు. 4 నెలల్లో 10,511 మంది వివాహం చేసుకోగా వాళ్లకు రూ.81.64 కోట్ల సాయం అందించింది ప్రభుత్వం. అయితే.. చదువును ప్రోత్సహించడం కోసం వధూవరులు ఇద్దరూ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. వధువు, వరుడు ఇద్దరూ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు.. వాళ్లకు ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సాయాన్ని ఇవాళ వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి 2023లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా.. మొదటి విడత కింద ఫిబ్రవరి 10న 4536 మంది లబ్ధిదారులకు 38.28 కోట్ల సాయం అందించింది.

Kalyana Masthu Scheme : మొత్తం సాయం 348.84 కోట్లు

ఈ సాయాన్ని ఇవాళ వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి 2023లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా.. మొదటి విడత కింద ఫిబ్రవరి 10న 4536 మంది లబ్ధిదారులకు 38.28 కోట్ల సాయం అందించింది. రెండో విడత కింద మే 5న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్లను అందించింది. మూడో విడత కింద ఆగస్టు 9న 18,883 మంది రూ.141.60 కోట్ల సాయం అందించారు. నాలుగో విడత కింద నవంబర్ 23న 10,511 మంది లబ్ధిదారులకు 81.64 కోట్ల సాయం కాగా మొత్తం లబ్ధిదారులు 46,062 కాగా మొత్తం అందిన సాయం 348.84 కోట్లు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది