
YSRCP : విశాఖలో వైసీపీకి షాక్..!
Ysrcp : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది. మరోవైపు గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. ఇక వైసీపీలో చురుకైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అక్కడ ఒక సామాజికవర్గం నాయకులు వైసీపీలో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్నా ఆ సామాజిక వర్గం ప్రజల నుంచి కూడా అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. టీడీపీకి కూడా ఇలాంటి సమస్య ఉండాల్సిందే కానీ ఆ పార్టీ కూటమిలో మిత్రుడిగా ఉంది. పైగా అధికారంలో ఉంది. దాంతో వైసీపీ లీడర్ల మీదనే ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ అవుతోంది అని అంటున్నారు.
దాంతో వారు తాము అనుకున్న పార్టీలో రాజకీయం చేయలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వీటికి తోడు చాలా ఆకర్షణలు అధికారాలు ఇవన్నీ కూడా బలంగా పనిచేయడంతో వైసీపీ గోదావరి జిల్లాలో అల్లాడిపోతోంది. ఆ పార్టీ అక్కడ నిలిచి నిలదొక్కుకోవడం మాత్రం టఫ్ జాబ్ గా మారేలా ఉంది. జనసేన అధికారంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ అప్పట్లో పిలుపు ఇచ్చినట్లుగా గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా చేసే కార్యక్రమం అయితే సాగుతోంది. దీనిని తట్టుకుంటూ ముందుకు సాగే మార్గాలను అయితే వైసీపీ అన్వేషించలేకపోవడం కొసమెరుపు. అయితే కూటమి మీద వారి పాలన మీద కొంత వ్యతిరేకత రావాలి. అప్పటిదాకా గోదావరిలో ఈ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ వైసీపీ ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు.
Ysrcp : గోదారోళ్ల దెబ్బకు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, త్వరలోనే జనసేనలో చేరుతామని ఘంటా పద్మశ్రీ వివరించారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ కోసం భజన చెయ్యడానికి నాయకులు కరువు అయ్యారని తెలుస్తుంది.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.