Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?

Ysrcp : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది. మరోవైపు గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?

Ysrcp : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది. మరోవైపు గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. ఇక‌ వైసీపీలో చురుకైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అక్కడ ఒక సామాజికవర్గం నాయకులు వైసీపీలో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్నా ఆ సామాజిక వర్గం ప్రజల నుంచి కూడా అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. టీడీపీకి కూడా ఇలాంటి సమస్య ఉండాల్సిందే కానీ ఆ పార్టీ కూటమిలో మిత్రుడిగా ఉంది. పైగా అధికారంలో ఉంది. దాంతో వైసీపీ లీడర్ల మీదనే ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ అవుతోంది అని అంటున్నారు.

Ysrcp ఎదురీదాల్సిందే…

దాంతో వారు తాము అనుకున్న పార్టీలో రాజకీయం చేయలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వీటికి తోడు చాలా ఆకర్షణలు అధికారాలు ఇవన్నీ కూడా బలంగా పనిచేయడంతో వైసీపీ గోదావరి జిల్లాలో అల్లాడిపోతోంది. ఆ పార్టీ అక్కడ నిలిచి నిలదొక్కుకోవడం మాత్రం టఫ్ జాబ్ గా మారేలా ఉంది. జనసేన అధికారంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ అప్పట్లో పిలుపు ఇచ్చినట్లుగా గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా చేసే కార్యక్రమం అయితే సాగుతోంది. దీనిని తట్టుకుంటూ ముందుకు సాగే మార్గాలను అయితే వైసీపీ అన్వేషించలేకపోవ‌డం కొస‌మెరుపు. అయితే కూటమి మీద వారి పాలన మీద కొంత వ్యతిరేకత రావాలి. అప్పటిదాకా గోదావరిలో ఈ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ వైసీపీ ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు.

Ysrcp గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా

Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, త్వరలోనే జనసేనలో చేరుతామని ఘంటా పద్మశ్రీ వివరించారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ కోసం భజన చెయ్యడానికి నాయకులు కరువు అయ్యారని తెలుస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది