Categories: ExclusiveNewspolitics

Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి?

Advertisement
Advertisement

Ysrcp : ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాలు న‌మోద‌య్యాయి. వైసీపీ కేవ‌లం 10 సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఓట‌మికి కారణాలు ఏంటని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర వ‌ల్ల‌నే జ‌గ‌న్ ఓడిపోయాడ‌నే టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పెట్టినపుడు ఉత్తరాంధ్రా ముందుకు వచ్చి ఆదరించింది. అంతకు ముందు గౌతు లచ్చన్న వంటి వారు విపక్షంలో పోరాటాలు చేస్తే వారికి అండగా నిలబడింది. కృషికార్ వంటి పార్టీలను దగ్గరకు తీసింది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి ఉత్తరాంధ్రా నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఇక వైసీపీ పార్టీ పెట్టాక 2014లో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు ఇచ్చి సమాదరించింది.

Advertisement

Ysrcp తేడా ఎక్క‌డ కొట్టింది

2019లో ఏకంగా 28 ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లతో వైసీపీకి సూప‌ర్ విక్టరీ దక్కేలా చేసింది. అయితే ఐదేళ్ల త‌ర్వాత అంత మారింది. కేవలం రెండు అంటే రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు దక్కాయి. అది కూడా గిరిపుత్రులు దయతలచి ఇచ్చిన స్థానాలుగా ఉన్నాయి. మరి ఉత్తరాంధ్రా ఎందుకు వైసీపీని అంత ద్వేషించింది అంటే చాలా కార‌ణాలు వినిపిస్తున్నాయి. విశాఖను రాజధానిగా చేస్తామని వైసీపీ పదే పదే చెప్పింది. కానీ అదే ఆ పార్టీకి మైనస్ గా మారింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో భూ కబ్జాలు పెరిగిపోతాయని తమకు శాంతి ఉండదని ఉత్తరాంధ్రా ప్రజానీకం భయపడ్డారు.

Advertisement

ఎన్నికలకు కొద్ది నెలల ముందు శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఎక్కడ నుంచో వచ్చిన వారు శ్రీకాకుళం భూముల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారంటూ పెద్ద బాంబ్ పేల్చారు. విశాఖ రాజధాని అయితే మరింతగా జరుగుతాయని భయపడే ఉత్తరాంధ్రా జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయని అంటున్నారు. వైసీపీ విశాఖ రాజధాని అన్నది అనకుండా ఉంటే ఎంతో కొంత మేలు జరిగేదని ఇంత దారుణంగా ఓడి ఉండేది కాదని అంటున్నారు. విశాఖ రాజధాని అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటూ వైసీపీకి దక్కనీయకుండా చేశారు.

Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి?

అలాగే విజయనగరం శ్రీకాకుళం టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మరి జనాల మనోభావాలను ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా విశాఖ రాజధాని అని వైసీపీ అధినాయకత్వం ఒకటికి పదిసార్లు చెప్పి పూర్తిగా నష్టపోయింది అన్నది అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా వైసీపీ ఆ నినాదాన్ని మార్చుకుంటే మేలు అని అంటున్నారు. ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి..? ఎక్కడ తప్పిదం జరిగింది.. వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి..? ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.