Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి?

Ysrcp : ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాలు న‌మోద‌య్యాయి. వైసీపీ కేవ‌లం 10 సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఓట‌మికి కారణాలు ఏంటని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర వ‌ల్ల‌నే జ‌గ‌న్ ఓడిపోయాడ‌నే టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పెట్టినపుడు ఉత్తరాంధ్రా ముందుకు వచ్చి ఆదరించింది. అంతకు ముందు గౌతు లచ్చన్న వంటి వారు విపక్షంలో పోరాటాలు చేస్తే వారికి అండగా నిలబడింది. కృషికార్ వంటి పార్టీలను […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి?

Ysrcp : ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాలు న‌మోద‌య్యాయి. వైసీపీ కేవ‌లం 10 సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఓట‌మికి కారణాలు ఏంటని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర వ‌ల్ల‌నే జ‌గ‌న్ ఓడిపోయాడ‌నే టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పెట్టినపుడు ఉత్తరాంధ్రా ముందుకు వచ్చి ఆదరించింది. అంతకు ముందు గౌతు లచ్చన్న వంటి వారు విపక్షంలో పోరాటాలు చేస్తే వారికి అండగా నిలబడింది. కృషికార్ వంటి పార్టీలను దగ్గరకు తీసింది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి ఉత్తరాంధ్రా నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఇక వైసీపీ పార్టీ పెట్టాక 2014లో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు ఇచ్చి సమాదరించింది.

Ysrcp తేడా ఎక్క‌డ కొట్టింది

2019లో ఏకంగా 28 ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లతో వైసీపీకి సూప‌ర్ విక్టరీ దక్కేలా చేసింది. అయితే ఐదేళ్ల త‌ర్వాత అంత మారింది. కేవలం రెండు అంటే రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు దక్కాయి. అది కూడా గిరిపుత్రులు దయతలచి ఇచ్చిన స్థానాలుగా ఉన్నాయి. మరి ఉత్తరాంధ్రా ఎందుకు వైసీపీని అంత ద్వేషించింది అంటే చాలా కార‌ణాలు వినిపిస్తున్నాయి. విశాఖను రాజధానిగా చేస్తామని వైసీపీ పదే పదే చెప్పింది. కానీ అదే ఆ పార్టీకి మైనస్ గా మారింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో భూ కబ్జాలు పెరిగిపోతాయని తమకు శాంతి ఉండదని ఉత్తరాంధ్రా ప్రజానీకం భయపడ్డారు.

ఎన్నికలకు కొద్ది నెలల ముందు శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఎక్కడ నుంచో వచ్చిన వారు శ్రీకాకుళం భూముల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారంటూ పెద్ద బాంబ్ పేల్చారు. విశాఖ రాజధాని అయితే మరింతగా జరుగుతాయని భయపడే ఉత్తరాంధ్రా జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయని అంటున్నారు. వైసీపీ విశాఖ రాజధాని అన్నది అనకుండా ఉంటే ఎంతో కొంత మేలు జరిగేదని ఇంత దారుణంగా ఓడి ఉండేది కాదని అంటున్నారు. విశాఖ రాజధాని అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటూ వైసీపీకి దక్కనీయకుండా చేశారు.

Ysrcp జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది అందుకు కార‌ణం ఏంటి

Ysrcp : జ‌గ‌న్‌ని ఉత్త‌రాంధ్ర‌నే ఎక్కువ‌గా ద్వేషించింది.. అందుకు కార‌ణం ఏంటి?

అలాగే విజయనగరం శ్రీకాకుళం టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మరి జనాల మనోభావాలను ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా విశాఖ రాజధాని అని వైసీపీ అధినాయకత్వం ఒకటికి పదిసార్లు చెప్పి పూర్తిగా నష్టపోయింది అన్నది అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా వైసీపీ ఆ నినాదాన్ని మార్చుకుంటే మేలు అని అంటున్నారు. ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి..? ఎక్కడ తప్పిదం జరిగింది.. వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి..? ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది