YCP VS Janasena : ఆ ఒక్క స్థానంలో వైసీపీ వర్సెస్ జనసేనగా మారిన వ్యవహారం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YCP VS Janasena : ఆ ఒక్క స్థానంలో వైసీపీ వర్సెస్ జనసేనగా మారిన వ్యవహారం..!

YCP VS Janasena : ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు. ఈ నియోజకవర్గం ఒక ఎత్తు. అవును.. ఆ నియోజకవర్గం చాలా డిఫరెంట్. అదే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం. నిజానికి ఇది వైజాగ్ లో కలిసే ఉంటుంది. కానీ.. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. పెందుర్తి నియోజకవర్గానికి ఏపీలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయ ఉద్ధండులే గెలిచారు. చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నావాళ్లు ఇక్కడి నుంచి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 July 2023,3:00 pm

YCP VS Janasena : ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు. ఈ నియోజకవర్గం ఒక ఎత్తు. అవును.. ఆ నియోజకవర్గం చాలా డిఫరెంట్. అదే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం. నిజానికి ఇది వైజాగ్ లో కలిసే ఉంటుంది. కానీ.. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. పెందుర్తి నియోజకవర్గానికి ఏపీలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయ ఉద్ధండులే గెలిచారు. చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నావాళ్లు ఇక్కడి నుంచి గెలిచినవాళ్లే. ఒక ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ అప్పన్న.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.అందుకే పెందుర్తి రాజకీయాలు ఎప్పుడూ ఏపీలో హాట్ టాపికే. పెందుర్తిలో ఎక్కువగా ఉండే సామాజికవర్గాలు మూడు. ఒకటి కాపులు, రెండోది వెలమలు.. మూడోది బీసీలు. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పంచకర్ల రమేశ్ బాబు పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత పలు పార్టీలు తిరిగి చివరకు జనసేనకు వచ్చి పడ్డారు. నిజానికి.. పెందుర్తి అనేది పంచకర్లకు సెంటిమెంట్ సీటు. 2009 లో గెలిచిన తర్వాత ఆయన 2014 లో ఎలమంచిలిలో పోటీ చేశారు.. గెలిచారు. కానీ.. 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి ఓడిపోయారు. అందుకే.. తనకు అచ్చి వచ్చిన పెందుర్తి నుంచి మరోసారి పోటీ చేసి గెలవాలని ఆరాటపడుతున్నారు పంచకర్ల.ఇక.. వైసీపీ నుంచి పెందుర్తిలో యువనేత అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం పెందుర్తి ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. ప్రస్తుతం పంచకర్ల జనసేనలోనే ఉన్నారు కానీ.. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనతో పొత్తులో భాగంగా ఆ సీటు ఎవరికి వెళ్తుంది.

ysrcp VS janasena in pendurthi

ysrcp VS janasena in pendurthi

YCP VS Janasena : వైసీపీ నుంచి పెందుర్తిలో ఎవరు పోటీ చేయబోతున్నారు?

ఒకవేళ జనసేన ఆ టికెట్ ను వదులుకుంటుందా? టీడీపీకి ఇచ్చేస్తుందా? టీడీపీకి ఇస్తే.. టీడీపీకి గెలిచే సత్తా ఉందా? పంచకర్ల పట్టుబట్టి జనసేనకు టికెట్ కేటాయించేలా చేస్తే టీడీపీ సహకరిస్తుందా.. అనేది డౌటే. అలాగే.. ఇక్కడ సామాజిక కోణాలను కూడా చూడాలి. అందుకే.. ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేన మాత్రమే కాదు.. కాపు వర్సెస్ వెలమ అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో?

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది