YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..!
ప్రధానాంశాలు:
YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..!
YV Subbareddy : వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్టీపై జరుగుతున్న విమర్శలకు తీవ్రంగా స్పందించారు. ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కోటరీ పాలన నడిచిందన్న మాటలపై స్పందించిన సుబ్బారెడ్డి, “పార్టీలో కోటరీ నడిపింది ఎవరో ఆయనకే బాగా తెలుసు” అంటూ నేరుగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..!
YV Subbareddy విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
వైసీపీలో నెంబర్ 1, నెంబర్ 2 అనే స్థానాలు లేవని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, పార్టీ డెసిషన్స్ అన్నీ కలిసికట్టుగా తీసుకున్నవేనని తెలిపారు. వ్యక్తిగత కోణాల్లో విమర్శలు చేయడం అసహనంగా ఉందన్నారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ కేసు పేరుతో చేయబడుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
“ఒక లిక్కర్ కేసు కాదు, మా పార్టీ నాయకులపై ఎన్నో కుట్ర కేసులు వేస్తున్నారు. ప్రజల్లో మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఈ ప్రయోగాలు చేస్తున్నాయి” అని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ లో కనిపిస్తున్న అంతర్గత విభేదాలు రాజకీయంగా కీలక మలుపులు తేగలవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.