Aadavallu Meeku Johaarlu Movie Review మహానుభావుడవేరా.. నువ్వు మహానుభావుడవేరా అంటూ అప్పట్లో ఎప్పుడో హిట్ కొట్టాడు శర్వానంద్. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. చాలా సినిమాలు ఫుల్ టు ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఎందుకో శర్వా సినిమాలు ఎక్కువగా ఆడలేదు. పడిపడి లేచే మనసు, శ్రీకారం, మహాసముద్రం లాంటి సినిమాలు కూడా భారీ హైప్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నా.. నాకు ఆస్కార్ వద్దు కానీ.. సినిమా ఆడితే చాలు అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మహానుభావుడు తర్వాత వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ శర్వానంద్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇటీవల రిలీజ్ అయిన మహాసముద్రం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. తాజాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. మరి.. ఈసారైనా శర్వానంద్ ప్రేక్షకులను ఒప్పించాడా? ప్రేక్షకులను నవ్వించాడా? అసలు ఈ సినిమా ఎలా ఉంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు Aadavallu Meeku Johaarlu Movie Review అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
ఈ సినిమాలో మన హీరో శర్వానంద్ పేరు చిరు. హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఆధ్య. తన కుటుంబ సభ్యులే తన పెళ్లివిషయంలో శత్రవులుగా మారుతారు. ఎందుకంటే చిరుకు ఏ పెళ్లి సంబంధం వచ్చినా దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. అమ్మాయికి ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు. దాని వల్ల.. చిరుకు చాలా సమస్యలు వస్తాయి. ఏజ్ పెరుగుతున్నా పెళ్లి మాత్రం కాదు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో సంబంధాలు చూసినా ఒక్కటీ సెట్ కాదు.ఈ క్రమంలో చిరుకు ఆధ్య పరిచయం అవుతుంది. ఆధ్యను చూసి ప్రేమలో పడిపోతాడు. ఎలాగైనా ఇక ఆధ్యనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు చిరు. ఆధ్య కూడా చిరును ఇష్టపడుతుంది కానీ.. ఈ పెళ్లి జరగదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది ఆధ్య.
Aadavallu Meeku Johaarlu Movie Review : సినిమా పేరు : ఆడవాళ్ళు మీకు జోహార్లు
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్
డైరెక్టర్ : తిరుమల కిశోర్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీప్రసాద్
బ్యానర్ : లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దానికి కారణం తన అమ్మ వకుళ(ఖుష్బూ). వకుళకు పెళ్లి అన్నా.. మగాళ్లు అన్నా అస్సలు పడదు. పెళ్లిపై తనకు నమ్మకం ఉండదు. దీంతో ఏం చేయాలో చిరుకు అర్థం కాదు. మా అమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్లి.. లేదంటే నీ దారి నీది.. నా దారి నాది.. అని ఆధ్య.. చిరుకు చెబుతుంది.దీంతో ఖుష్బూను ఒప్పించడం కోసం.. తన కంపెనీలో చేరుతాడు చిరు. ఆ తర్వాత వకుళ కొన్ని సమస్యల్లో చిక్కుకోవడంతో వాటిని పరిష్కరిస్తాడు. అసలు తనకు పెళ్లి అంటే ఎందుకు నమ్మకం లేదో.. మగాళ్ల మీద ఎందుకు నమ్మకం లేదో.. ఫ్లాష్ బ్యాక్ ద్వారా చెబుతుంది వకుళ. ఆ తర్వాత అసలు.. చిరు ఎవరు? అనే విషయం వకుళకు తెలుస్తుంది. దీంతో.. వకుళ.. చిరు, ఆధ్య పెళ్లికి ఒప్పుకుంటుందా? ఇద్దరి పెళ్లి అవుతుందా? అసలు వకుళ ఎవరు? ఇందులో రాధిక పాత్ర ఏంటి? బ్రహ్మానందం పాత్ర ఏంటి? వెన్నెల కిశోర్ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
నేను శైలజ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నేను శైలజ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి, రెడ్ లాంటి సినిమాలు తీశాడు తిరుమల కిశోర్. ఆ సినిమాల తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు.అయితే.. ఈ సినిమా రొటీన్ కథే. కానీ.. ఆ రొటీన్ కథలో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ జోడించాడు తిరుమల. కాకపోతే సినిమా స్టోరీ ముందు తెలిసిందే అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఏ సీన్లు వస్తాయో ప్రేక్షకుడు ఊరికే గెస్ చేయగలడు. సినిమాలో ఎలాంటి మలుపులు మాత్రం ఉండవు.కాకపోతే.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడం వల్ల సినిమా మొత్తం పూర్తి స్థాయిలో ఎంటర్ టైనింగ్ గా ఉంది. అందువల్ల సినిమా బోర్ కొట్టదు. కామెడీకి కూడా ఈ సినిమాలో కొదువ లేదు.
మరోవైపు ఈ సినిమా వన్ మ్యాన్ షో కాకుండా.. శర్వానంద్ తో పాటు.. రష్మిక, రాధిక, ఖుష్బూ, వెన్నెల కిశోర్ పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చాడు డైరెక్టర్. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ బాగుంది.
సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్, స్క్రీన్ ప్లే, రచన, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్, సుకుమార్ వాయిస్ ఓవర్, రష్మిక స్టయిల్, లుక్, శర్వానంద్ యాక్టింగ్.
మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్, గెస్ చేసే కథ
మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. ఈ సినిమా ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా. ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కే నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ ఏదో ఊహించుకొని ఈ సినిమాకు వెళ్తే మాత్రం కష్టం. కాస్త కామెడీతో ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకుంటే ఈ సినిమాకు ఖచ్చితంగా వెళ్లొచ్చు. ఒకసారి చూసి ఎంజాయ్ చేసి వస్తారు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.