Acharya Movie Review : చిరంజీవి ఆచార్య మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya Movie Review : చిరంజీవి ఆచార్య మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 April 2022,11:55 pm

Acharya Movie Review : ఆచార్య అంటే ఎవరో మనకు తెలుసు. చదువు చెప్పేవాళ్లను ఆచార్య అని మనం సంభోదిస్తుంటాం. ఇంకా.. ఎవరైనా గురువులను కూడా ఆచార్య అంటాం. ఇక.. ఈ సినిమాలో ఆచార్య Acharya Movie Review అంటే ఎవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి. తొలిసారి తండ్రీకొడుకులు ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు.. కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవితో పాటు తన కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. నిజానికి.. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చిన్నదే. కానీ.. అది కాస్త పెద్దగా అయిందట. చివరకు 40 నిమిషాలు రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుందట. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.
సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అయితే.. యూఎస్ లో ప్రీమియర్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మరి.. యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

acharya movie review and live updates

acharya movie review and live updates

Acharya Movie Review : సినిమా పేరు : ఆచార్య
నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి తదితరులు
డైరెక్టర్ : కొరటాల శివ
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
నిర్మాత : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ రామ్ చరణ్
రిలీజ్ డేట్ : 29-04-2022

Acharya Movie Review : ఆచార్య మూవీ లైవ్ అప్ డేట్స్

సినిమా ప్రారంభం అవుతుంది. ప్రారంభమే మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది. ధర్మస్థలి గురించి మహేశ్ బాబు చెబుతాడు.

ఆ తర్వాత చిరంజీవి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆచార్యగా ఆయన ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. ఆ తర్వాత లాహే లాహే పాట వస్తుంది. చిరు ఆ పాటకు వేసిన స్టెప్పులు హైలైట్. ఫ్యాన్స్ కు పండగే.

ఆ తర్వాత సోనూసూద్ ఎంట్రీ ఉంటుంది. ఆయన లోకల్ ఎమ్మెల్యే. దేవాదాయ శాఖకు సంబంధించిన డబ్బులను కాజేస్తుంటాడు. విలన్ కోసం కూడా కొరటాల ప్రత్యేకంగా ఒక ఇంట్రడక్షన్ ప్లాన్ చేశాడు. విలన్ ఎంట్రీ కూడా కొత్తగా ఉంటుంది.

ధర్మస్థలిలో ఉండే ప్రజలు.. సోనూసూద్(బసవ) ఆగడాలను భరించలేకపోతారు. ఇంతలో సినిమా ఫస్ట్ ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ యావరేజ్ గా ఉంది.

ఆ తర్వాత జీషు సేన్ గుప్తా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆయన బడా వ్యాపారవేత్త. తన వ్యాపార ఎదుగుదల కోసం ఎంతటివారి అడ్డునైనా తొలగించే సత్తా ఉన్న వ్యక్తి. సెకండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే పూజా హెగ్డే ఇంట్రడక్షన్ వస్తుంది. తను మ్యూజిక్ టీచర్. రాధమ్ సీన్ అదిరిపోతుంది.

చానా కష్టం అనే పాట వస్తుంది. ఆ పాటలో చిరు స్టెప్స్ చూసి మైమరిచిపోవాల్సిందే. తన ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. ధర్మస్థలిలో గుండాలకు ఎదురుతిరుగుతాడు చిరంజీవి. ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చే ఫైట్ అదిరిపోతుంది. అప్పుడే సిద్ధాగా రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుంది.

రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇంటర్వల్ వస్తుంది. మొత్తానికి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్లు, ఫైట్స్, ప్రీ ఇంటర్వల్ సీన్స్ అదిరిపోతాయి.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫస్ట్ హాఫ్ లో మెగా అభిమానులకు కావాల్సిన అసలైన సీన్లు ఏవీ ఉండకున్నా.. కథకు అవసరమైన పాత్రల ఇంట్రడక్షన్ కే సమయం సరిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో కేవలం రామ్ చరణ్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది.

సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. పూజా హెగ్దే నీలాంబరి పాట వస్తుంది. ఈ పాటలో చరణ్ డ్యాన్స్ బాగుంటుంది. ఆ తర్వాత రామ్ చరణ్, సోనూసూద్ కలుస్తారు. అంతకుముందే రామ్ చరణ్ నక్సల్స్ బారి నంచి ఎలా తప్పించుకున్నాడో ఉంటుంది.

వరుసగా ఫైట్ సీన్స్ వస్తాయి. చివరకు భలే బంజారా పాట వస్తుంది. చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు తప్పితే సినిమాలో అంతగా ఎలివేట్ అయిన సన్నివేశాలు ఇంకా ఏం లేవు. నీలాంబరి, భలే బంజారా పాటలు మాత్రం బాగున్నాయి. భలే బంజారా పాటలో ఇద్దరి కాంబో అదిరిపోయింది. పూర్తి రివ్యూ కాసేపట్లో దితెలుగున్యూస్ వెబ్ సైట్ లో ఇవ్వబడుతుంది.

  • Also Read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది