Allu arjun pushpa Movie story and Review
Pushpa Movie Story : ఒకప్పటి లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ మరి కొన్ని గంటల్లో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాకీసుల వద్ద తమ అభిమాన హీరో బన్నీకి పూల మాలలు వేయడంతో పాటు టపాసులు పేల్చి సంబురాలు చేసుకునేందుకుగాను సిద్ధమవుతున్నారు. కాగా, ఈ సినిమా స్టోరిలోని కీలక పాయింట్ ఇదేనని సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. కాగా, ఈ కథకు ఎమోషనల్ పాయింట్‌గా సవతి కొడుకులనే కీలక అంశాన్ని సుకుమార్ హైలైట్ చేస్తారని తెలుస్తోంది.
Pushpa Movie Story : కమర్షియల్ ఫార్ములాతో సుక్కు భాయ్ సేఫ్ గేమ్.. !
Allu arjun pushpa Movie story and Review
పలువురు అంచనా వేస్తున్నట్లు కథలో అల్లు అర్జున్, అజయ్ ఇద్దరు సవతి సోదరులట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పాత్రకు ఇంట్లో ప్రేమ, గౌరవం దక్కక ఇంటి నుంచి బయటకు వచ్చేసి అడవులకు వెళ్లిపోతాడు. అలా అడవులకు వెళ్లే క్రమంలో తన అన్న కంటే తానే పవర్ ఫుల్ అని నిరూపించుకునే క్రమంలో ‘పుష్ప’రాజ్‌గా అల్లు అర్జున్ పాత్ర ఎదుగుతుందని తెలుస్తోంది.ఇలా సవతి సోదరుల ఫార్ములా ఇండస్ట్రీలో చాలా సార్లు వర్కవుట్ అయింది.
మణిరత్నం ‘ఘర్షణ’ నుంచి మొదలుపెడితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ వరకూ పలు సినిమాల్లో ఇదే స్టోరిగా ఉంది. కాగా, ఎమోషన్ పండించే పరిస్థితులు ఇటువంటి కథలో ఉంటాయట. అలా సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఫార్ములా లెక్కలు వేసుకునే సుకుమార్ ‘పుష్ప’తో బాక్సాఫీసులో సేఫ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేశారని టాక్. అయితే, ఈ ఎమోషనల్ స్టోరిలో ఫస్ట్ పార్ట్‌ను ఎలా ముగించి..సెకండ్ పార్ట్‌కు తీసుకెళ్తాడనేది సస్పెన్స్‌గా ఉండబోతున్నది. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ స్టోరి నిజమా కాదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.