Alluri Movie Review : అల్లూరి మూవీ రివ్యూ & రేటింగ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alluri Movie Review : అల్లూరి మూవీ రివ్యూ & రేటింగ్…!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2022,10:30 am

Alluri Movie Review : మొద‌టి నుండి విభిన్న‌మైన ప్ర‌యోగాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది అని శ్రీ విష్ణు ప్ర‌మోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మ‌రి శ్రీ విష్ణు పోలీస్ ఆఫీస‌ర్‌గా ఎంత‌గా మెప్పించాడో చూద్దాం.

Alluri Movie కథ‌… తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన శ్రీ విష్ణు ఇందులో ప‌లు కార‌ణాల వ‌ల‌న అనేక బ‌దిలీల‌ను ఎదుర్కొంటాడు. అత‌ను ఎందుకు అన్ని సార్లు బ‌దిలీ కావ‌ల‌సి వ‌స్తుంద‌నేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇక ఓసారి రాజ‌కీయ నాయ‌కుడు ఎదురు ప‌డిన్ప‌పుడు ఆయ‌న‌తో శ్రీ విష్ణు చేసే ఫైట్ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఫైట్ లో గెలుపెవ‌రిది, దేని వ‌ల‌న శ్రీ విష్ణు అత‌నితో పోరాడాల్సి వ‌చ్చింద‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Alluri Movie Review and Rating in Telugu

Alluri Movie Review and Rating in Telugu

ప‌నితీరు : రామరాజుగా శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. మేకొవ‌ర్ కూడా బాగుంఉది. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌లో క‌నిపించి మెప్పించాడు. కయదు లోహర్ ఓ మాదిరి క‌నిపించి మెప్పించింది .మిగిలిన నటీనటులు తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర , పృధ్వీ రాజ్ , రవివర్మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక టెక్నికల్‌గా అల్లూరి యావరేజ్‌గా కనిపిస్తాడు, అర్జున్ రెడ్డితో మెప్పించిన రాజ్ తోట ఇందులో విజువ‌ల్స్‌ని అంత‌గా చూపించ‌లేక‌పోయాడు. హర్షవర్ధన్ సంగీతం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మెప్పించాడు మరియు మిగిలిన సాంకేతిక బృందం ప‌ర్వాలేద‌నిపించింది.

ప్ల‌స్ పాయింట్స్

శ్రీ విష్ణు న‌ట‌న‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైన‌స్ పాయింట్స్ : క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
రొటీన్ స‌న్నివేశాలు

విశ్లేష‌ణ : ఈ సినిమా రిలీజ్‌కి ముందు జ‌రిగిన ప్ర‌మోష‌న్స్ లో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ కథ వినగానే నేను ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఇదే. కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం నేను బరువు తగ్గడం .. పెరగడం చేశాను. ఆడియన్స్ పెట్టే డబ్బుకి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను” అంటూ సమాధానమిచ్చాడు. కాని ఇందులో కొత్తద‌నం లేదు, వినోదం దొర‌క‌లేదు. రొటీన్ స‌న్నివేశాలతో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని పాత చింత‌కాయ ప‌చ్చడిలా చేశాడు. మూవీ కొన్ని వ‌ర్గాల వారికి మాత్ర‌మే న‌చ్చుతుంది.

రేటింగ్ 1.55

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది