Ante Sundaraniki Movie Review : అంటే సుందరానికి మూవీ ఫస్ట్ రివ్యూ
Ante Sundaraniki Movie Review : శ్యామ్ సింగరాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన మూవీ అంటే సుందరానికి. నిజానికి.. శ్యామ్ సింగరాయ్.. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. అంతకుముందు టక్ జగదీశ్ అంటూ ఓటీటీలోకి వచ్చినా.. జగదీశ్ కూడా ప్రేక్షకులను సరిగ్గా మెప్పించకపోయాడు. అందుకే.. ఈసారి సరికొత్త కథతో అంటే సుందరానికీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు నాని.
నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కాసేపట్లో విడుదల కానుంది. ఇంకొన్ని గంటలు అంతే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోంది.ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. తన గత సినిమాలకు భిన్నంగా ఈసారి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని.
Ante Sundaraniki Movie Review: అంటే సుందరానికి మూవీ ఫస్ట్ రివ్యూ
Ante Sundaraniki Movie Review: సినిమా పేరు : అంటే సుందరానికి
నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, హర్షవర్థన్, అజగం పెరుమాల్, నదియా, నిక్కీ తంబోలీ, రోహిణీ తదితరులు
డైరెక్టర్ : వివేక్ ఆత్రేయ
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్
నిర్మాత : వై రవిశంకర్, సీవీ మోహన్
ప్రొడక్షన్ కంపెనీ : మైత్రీ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి
రిలీజ్ డేట్ : 10 జూన్ 2022
Ante Sundaraniki Movie Review : క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి కష్టాల్లో పడ్డ బ్రాహ్మణ కుర్రాడు
ఈ సినిమాలో అచ్చ తెలుగు బ్రాహ్మణ కుర్రాడిగా నాని కనిపించాడు. అతడి పేరు సుందర్. యూఎస్ కు వెళ్లి అక్కడ లీలా థామస్(నజ్రియా)ను ప్రేమిస్తాడు. కానీ.. తను క్రిస్టియన్. ఇద్దరి ఫ్యామిలీలలో వాళ్ల ప్రేమను ఒప్పుకోరు. దీంతో వాళ్ల ప్రేమను ఒప్పించడం కోసం సుందర్ ఏం చేశాడు అనేదే సినిమా.ఇప్పటికే సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాకపోతే కనీసం సినిమా రిలీజ్ అయిన ఓ నెల తర్వాతనే నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక.. అంటే సుందరానికీ.. సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ప్రదర్శించారు.
Ante Sundaraniki Movie Review : సినిమా లైవ్ అప్ డేట్స్
సినిమా ప్రారంభమే తన చిన్నతనం మెమోరీస్ తో ప్రారంభం అవుతుంది. టైటిల్ కార్డ్స్ పడగానే.. నాని ఎంట్రీ ఉంటుంది.
ఆ తర్వాత ఒక తండ్రి, కొడుకు మధ్య ఉండే బంధాన్ని సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నాని సుందర్ పాత్రను పోషించాడు. తన తండ్రి మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతుంటాడు.
ఆ తర్వాత తన తండ్రిని ఒప్పించి సుందర్ యూఎస్ కు వెళ్తాడు. హీరోయిన్ నజ్రియా యూఎస్ లో ఉంటుంది. తన పేరు లీలా థామస్.
అక్కడే సుందర్ కు లీలా పరిచయం అవుతుంది. కానీ.. అక్కడే కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
సుందర్ హిందువు కాగా.. లీలా క్రిస్టియన్. ఇద్దరి పెళ్లికి తమ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో.. వాళ్లను ఒప్పించేందుకు నాని, లీలా ఎన్నికష్టాలు పడ్డాడు అనేదే సినిమా సెకండ్ హాఫ్ గా నడుస్తుంది.
మొత్తానికి సినిమా మాత్రం ఫుల్ టు ఫన్, ఎంటర్ టైన్ మెంట్ గా నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ఒక ఫన్ రైడ్ గా ఉంటుంది.