Asalem Jarigindi Movie Review : కోలీవుడ్ హీరో శ్రీరామ్ తమిళ్‌లో పలు సినిమాలు చేస్తూనే తెలుగులో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తుంటారు. ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చాలా తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘అసలేం జరిగింది’ థియేటర్స్‌లో విడుదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు సాగుతున్నది. ఈ మూవీలో హీరో శ్రీరామ్ సరసన హీరోయిన్‌గా సంచయిత పడుకొనే నటించింది. సినిమా కథలోకి వెళ్తే..తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హీరో శ్రీరామ్ సరసన తొలిసారి సంచయిత పడుకొనే హీరోయిన్‌గా నటించగా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.
అయితే, మిగతా సినిమాల మాదిరిగా ఈ ఫిల్మ్‌లోనూ లవ్ స్టోరి కామన్ పాయింట్ కాగా, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ అల్లిక విధానంలో తేడా ఉంది. హీరో శ్రీరామ్ తన జీవితంలో అనుకోకుండా ఎదురైన ఉపద్రవాలను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా చూపించారు. తన విలేజ్‌లో ప్రతీ అమవాస్య నాడు ఏదో శక్తి గ్రామంలోపలకి వచ్చి ఆవరిస్తుందని, అందరూ నాశనం అయిపోతారని ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరించడంతో గ్రామస్తులు అందరూ భయపడిపోతుంటారు. అయితే, హీరో శ్రీరామ్ సమస్య పరిష్కరించేందుకుగాను ప్రయత్నాలు చేస్తుంటాడు. మానవులకు అందని అతీతమైన శక్తి ఉందా? అని అనుకుంటాడు. ఈ క్రమంలోనే తాంత్రికుడిగా ప్రతినాయకుడి ఎంట్రీ, హీరోయిన్‌ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ హీరో, హీరోయిన్ ఎక్కడ కలుస్తారా? నిజంగానే అతీత శక్తులు ఉన్నాయా? లేదా అన్న విషయాలతో పాటు హీరో శ్రీరామ్ తన గ్రామాన్ని అతీత శక్తుల నుంచి ఎలా కాపాడుతాడనేది సిల్వర్ స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది.
మూవీ మేకింగ్‌లో చాలా శ్రద్ధ కనబరిచినట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఇంత వరకు ప్రొడక్షన్ కంపెనీగా ఉన్న ‘ఎక్సోడోస్ మీడియా’ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిపుణులు చాలా కష్టపడినట్లు అర్థమవుతుంది. వారి శ్రమ వెండితెరపైన కనబడుతున్నది. ఈ సినిమాకు ఏలెంద్ర మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ ఫిల్మ్ దర్శకత్వం వహించిన ఎస్‌వీర్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు చాలా వాటిలో సపోర్టింగ్ రోల్, నెగెటివ్ రోల్ ప్లే చేసిన శ్రీరామ్ ఈ సినిమాలోని పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ముఖ్యంగా కథనాయకుడిగా తన ఊరిని అతీత శక్తుల నుంచి కాపాడేందుకుగాను శ్రీరామ్ చేసిన సాహసం, హీరోయిన్‌ను రక్షించేందుకుగాను చేసిన ఫీట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ సంచయిత పడుకొనే కూడా తనదైన శైలిలో పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యాక్షన్ సన్నివేశాల్లో మీరో శ్రీరామ్ ఇరగదీశాడని ప్రేక్షకులు అంటున్నారు.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.