Asalem Jarigindi Movie Review : ‘అసలేం జరిగింది’ మూవీ రివ్యూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Asalem Jarigindi Movie Review : ‘అసలేం జరిగింది’ మూవీ రివ్యూ

 Authored By mallesh | The Telugu News | Updated on :22 October 2021,1:40 pm

Asalem Jarigindi Movie Review : కోలీవుడ్ హీరో శ్రీరామ్ తమిళ్‌లో పలు సినిమాలు చేస్తూనే తెలుగులో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తుంటారు. ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చాలా తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘అసలేం జరిగింది’ థియేటర్స్‌లో విడుదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు సాగుతున్నది. ఈ మూవీలో హీరో శ్రీరామ్ సరసన హీరోయిన్‌గా సంచయిత పడుకొనే నటించింది. సినిమా కథలోకి వెళ్తే..తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హీరో శ్రీరామ్ సరసన తొలిసారి సంచయిత పడుకొనే హీరోయిన్‌గా నటించగా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.

Asalem Jarigindi Movie Review

Asalem Jarigindi Movie Review

Asalem Jarigindi Movie Review : న్యూ కాన్సెప్ట్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న డ్రామా..

అయితే, మిగతా సినిమాల మాదిరిగా ఈ ఫిల్మ్‌లోనూ లవ్ స్టోరి కామన్ పాయింట్ కాగా, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ అల్లిక విధానంలో తేడా ఉంది. హీరో శ్రీరామ్ తన జీవితంలో అనుకోకుండా ఎదురైన ఉపద్రవాలను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా చూపించారు. తన విలేజ్‌లో ప్రతీ అమవాస్య నాడు ఏదో శక్తి గ్రామంలోపలకి వచ్చి ఆవరిస్తుందని, అందరూ నాశనం అయిపోతారని ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరించడంతో గ్రామస్తులు అందరూ భయపడిపోతుంటారు. అయితే, హీరో శ్రీరామ్ సమస్య పరిష్కరించేందుకుగాను ప్రయత్నాలు చేస్తుంటాడు. మానవులకు అందని అతీతమైన శక్తి ఉందా? అని అనుకుంటాడు. ఈ క్రమంలోనే తాంత్రికుడిగా ప్రతినాయకుడి ఎంట్రీ, హీరోయిన్‌ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ హీరో, హీరోయిన్ ఎక్కడ కలుస్తారా? నిజంగానే అతీత శక్తులు ఉన్నాయా? లేదా అన్న విషయాలతో పాటు హీరో శ్రీరామ్ తన గ్రామాన్ని అతీత శక్తుల నుంచి ఎలా కాపాడుతాడనేది సిల్వర్ స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది.

Asalem Jarigindi Movie Review

Asalem Jarigindi Movie Review

Asalem Jarigindi Movie Review  టెక్నికల్ ఎక్సలెన్స్..

మూవీ మేకింగ్‌లో చాలా శ్రద్ధ కనబరిచినట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఇంత వరకు ప్రొడక్షన్ కంపెనీగా ఉన్న ‘ఎక్సోడోస్ మీడియా’ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిపుణులు చాలా కష్టపడినట్లు అర్థమవుతుంది. వారి శ్రమ వెండితెరపైన కనబడుతున్నది. ఈ సినిమాకు ఏలెంద్ర మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ ఫిల్మ్ దర్శకత్వం వహించిన ఎస్‌వీర్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు చాలా వాటిలో సపోర్టింగ్ రోల్, నెగెటివ్ రోల్ ప్లే చేసిన శ్రీరామ్ ఈ సినిమాలోని పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ముఖ్యంగా కథనాయకుడిగా తన ఊరిని అతీత శక్తుల నుంచి కాపాడేందుకుగాను శ్రీరామ్ చేసిన సాహసం, హీరోయిన్‌ను రక్షించేందుకుగాను చేసిన ఫీట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ సంచయిత పడుకొనే కూడా తనదైన శైలిలో పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యాక్షన్ సన్నివేశాల్లో మీరో శ్రీరామ్ ఇరగదీశాడని ప్రేక్షకులు అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది