Categories: NewsReviews

Bhairavam Movie Review : భైర‌వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhairavam Movie Review : మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి చేసిన చిత్రం ‘భైరవం’. గరుడాన్ అనే తమిళ మూవీ నుంచి విజయ్ కనకమేడల రీమేక్ చేసి భైరవంగా మార్చాడు. ఈ మూవీని మే 30న విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ముగ్గురు హీరోల ఎనర్జీ ఈ ప్రమోషన్స్‌కు బాగానే కలిసి వచ్చింది.

Bhairavam Movie Review : భైర‌వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhairavam Movie Review నటీనటులు

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ,అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తదితరులు
దర్శకుడు : విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాతలు : కెకె రాధామోహ‌న్,జ‌యంతి లాల్
సంగీతం : శ్రీ చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్రఫీ : హ‌రి కె వేదాంతం
ఎడిటింగ్ : చోటా కె ప్ర‌సాద్

మల్టీ స్టారర్ సినిమాగా రూపొందిన భైరవం మూవీ తమిళంలో రూపొందిన గురుడన్ సినిమాకు రీమేక్. ఈ సినిమాలోని కోర్ పాయింట్‌ను తీసుకొని తెలుగు నేటివిటీ, భావోద్వేగాలను జోప్పించి ఈ సినిమాను రూపొందించారు. అలాగే బెల్లంకొండ శ్రీను, మనోజ్, రోహిత్ ఇమేజ్‌లకు అనుగుణంగా ఈ మూవీలోని పాత్రలను తీర్చిదిద్దారు. భైరవం సినిమాలోని సన్నివేశాలు హింసతో కూడుకొన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే ఎమోషన్స్‌తో యాక్షన్ సీన్లు కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. ముఖ్యంగా యూత్‌ను అలరించే విధంగా ఫైట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు చూసేందుకు కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయనే వాదనను వినిపించారు. దాంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు.

ఫస్ట్ హాఫ్‌లో అనవసరమైన పాటలు, లవ్ ట్రాక్ వల్ల కథ కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుందట. ఒక సారి అసలు కథ స్టార్ట్ అయ్యాక మాత్రం ఇంటర్వెల్ వరకు అదిరిపోయిందట. ఎంగేజింగ్‌గా అనిపిస్తుందట. ఇంటర్వెల్‌లో సాలిడ్ బ్లాక్ ఉంటుందట. ముగ్గురు హీరోలకు మంచి పాత్రలు లభించాయని చెబుతున్నారు.

Bhairavam Movie Review ‘భైరవం’ కథ ..

వరద (నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్), శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. చిన్నతనంలో ప్రమాదంలో చిక్కుకున్న వీరిని అనాథ అయిన శీను కాపాడతాడు. అప్పటి నుంచి ముగ్గురూ కలిసి మెలిసి పెరుగుతారు.. ఆ ఊర్లో ఉన్న వారాహి అమ్మవారి గుడికి ట్రస్టీగా వ్యవహరించే వరదకి, దేవదాయ శాఖ మంత్రికి మధ్య రూ.1000 కోట్ల విలువైన గుడి మాన్యాల గురించి గొడవ జరుగుతుంది. ఆ గొడవ కాస్త స్నేహితుల మధ్య వైరంగా మారుతుంది. కోట్ల విలువైన గుడి మాన్యం ఏమైంది? తెలియాలంటే ‘భైరవం’ మూవీ చూడాల్సిందే..

Bhairavam Movie Review న‌ట‌నా ప‌ర్‌ఫార్మెన్స్:

ఇక సినిమాలో మెయిన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నటనలో చక్కని పరిణితి చూపించాడు.. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్స్ చూస్తే అతను నటనలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ ముగ్గురు హీరోలు పోటీపోటీగా చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ‘భైరవం’ మూవీకి మెయిన్ హైలైట్. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ పాత్రల్లో చక్కగా నటించారు. వెన్నెల కిషోర్, జయప్రద, అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, శరత్ లోహితస్వ, ఇతర నటులు తమ పాత్రల్లో పరిధిమేర నటించారు.

Bhairavam Movie Review టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

‘భైరవం’ మూవీకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో శ్రీచరణ్ మ్యూజిక్ బాగా పేలింది.. పాటలు కూడా పర్లేదని అనిపిస్తాయి.. ఇక ఈ మూవీ కోసం దాదాపు రూ.50 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు నిర్మాత రాధామోహన్. స్క్రీన్ మీద ఆ రిచ్‌నెస్ కనిపిస్తుంది.. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సీన్స్ రీ-రికార్డింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అక్కడక్కడా డబ్బింగ్ ట్రాక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.. ద‌ర్శ‌కుడు కూడా బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు.

ప్ల‌స్ పాయింట్స్:

మ్యూజిక్
క‌థ‌, క‌థ‌నం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

ఫ‌స్టాఫ్
సాగ‌దీత స‌న్నివేశాలు

విశ్లేష‌ణ‌:
ఫస్టాఫ్ కాస్త సోసోగా అనిపించినా ఇంటర్వెల్ నుంచి సినిమాలో కథ, కథనం రక్తి కడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌లకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ ‘భైరవం’. తెలుగులో ఇలా ముగ్గురు హీరోలు కలిసి సినిమా చేసి చాలా ఏళ్లు అయ్యింది. మల్టీస్టారర్ సినిమాలు రావాలని కోరుకునే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి ‘భైరవం’ బాగా నచ్చుతుంది. రూరల్ యాక్షన్ డ్రామాలో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కొన్నాళ్లుగా సరైన యాక్షన్ మూవీ రావడం లేదని ఫీలవుతున్న యాక్షన్ లవర్స్‌కి, ఈ ముగ్గురు హీరోల అభిమానులకు ‘భైరవం’ కచ్ఛితంగా నచ్చుతుంది…

రేటింగ్ : 3/5

Recent Posts

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

17 hours ago