బ్రో సినిమా ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ – దీ తెలుగు న్యూస్ ఎక్స్ క్లూజివ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

బ్రో సినిమా ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ – దీ తెలుగు న్యూస్ ఎక్స్ క్లూజివ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన “బ్రో” సినిమా ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. ఫస్ట్ టైం పవన్ మెగా హీరోతో కలిసి మల్టీ స్టారర్ చేయటంతో మెగా అభిమానులలో “BRO”.. పై భారీ ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో విడుదలైన “వినోదయ సీతం” కి రీమేక్ గా తెరకెక్కిన… ఈ చిత్రనికి సముద్రఖని… దర్శకుడు. అయితే ఈ సినిమాకి సంబంధించిటీ వలె సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ సభ్యులు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :20 July 2023,9:00 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన “బ్రో” సినిమా ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. ఫస్ట్ టైం పవన్ మెగా హీరోతో కలిసి మల్టీ స్టారర్ చేయటంతో మెగా అభిమానులలో “BRO”.. పై భారీ ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో విడుదలైన “వినోదయ సీతం” కి రీమేక్ గా తెరకెక్కిన… ఈ చిత్రనికి సముద్రఖని… దర్శకుడు. అయితే ఈ సినిమాకి సంబంధించిటీ వలె సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ సభ్యులు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రం నిడివి రెండు గంటల 15 నిమిషాలట. ఈ క్రమంలో “బ్రో” సినిమాకి సంబంధించి ఇంటర్నెట్ లో మొదటి రివ్యూ రావడం జరిగింది. వచ్చిన రివ్యూబట్టి సినిమా ఎలా ఉంది అంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసే రీతిలో.. ఈ సినిమాని తెరకెక్కించారట.

పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ చాలా కొత్తగా అభిమానులను ఎంతో అలరించే విధంగా.. ఇందులో పంచ్ డైలాగ్స్ ఉన్నాయట. సినిమా ప్రారంభమైన వాటినుండి మొదటి 20 నిమిషాల పాటు… కడుపుబ్బ నవ్వించే కామెడీ పవన్ చేశారట. ఇక ఇదే సమయంలో ప్రారంభంలో ఎలా కామెడీ ఉంటుందో సినిమా చివరి 20 నిమిషాలు పవన్ అంతగా ఏడిపిస్తాడట. జీవితం యొక్క అర్ధాన్ని తెలిపే రీతిలో ఈ సినిమాని తెరకెక్కించారట. సినిమాకి త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. మరింతగా ఆకట్టుకుంటాయట. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని డైలాగ్స్ ఇందులో ఉన్నట్లు టాక్. మొత్తం మీద చూసుకుంటే “బ్రో” సినిమా మొదటి భాగం అంత కామెడీ సెకండాఫ్ మాత్రం.. కామెడీ ప్లస్ సెంటిమెంట్ తో అలరించే విధంగా.. సినిమా చేసినట్లు తెలుస్తోంది.

Bro movie online first review the telugu news exclusiv

Bro movie online first review the telugu news exclusiv

ఇక ఈనెల 25వ తారీకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయటం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన “BRO” సినిమా సాంగ్స్ మరియు పోస్టర్ అదే విధంగా టీజర్ ఎంతో ఆకట్టుకోవటం జరిగింది. మరి ట్రైలర్ త్వరలో రిలీజ్ కాబోతున్న క్రమంలో.. సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది