Bro Movie : ఇంతకీ బ్రో సినిమా హిట్టా ఫ్లాపా ?
Bro Movie : తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ బ్రో ‘ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద సందడి వేరేలా ఉంటుంది. ఆ సినిమా మొదలై రిలీజ్ అయ్యే వరకు ప్రతి దాని గురించి చర్చ ఉంటుంది. మిగతా సినిమాలతో పోలుస్తూ గట్టి పోటీ వాతావరణం నెలకొట్టుంటుంది. పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా అంటే రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే అనే ధీమాతో ఉంటారు ఆయన అభిమానులు.
కానీ ఈసారి బ్రో సినిమా విషయంలో అలా కనబడట్లేదు. అభిమానులు చాలా సైలెంట్ గా కనిపిస్తున్నట్లు ఉంది. ఇతర హీరోల సినిమాల రికార్డులను పోల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేరని అనిపిస్తోంది. అందుకు కారణం బ్రో సినిమాకు మొదటినుంచి భారీగా హైప్ క్రియేట్ అవ్వలేదు. విడుదలైన మొదటి రెండు సాంగ్స్ టీజర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు మాస్ సినిమా కాదు. అయినప్పటికీ సినిమా మొదటి రోజు ఫ్యాన్స్ భారీగానే తరలివచ్చారు. దీంతో మంచి ఓపెనింగ్స్ ఒకవేళ వచ్చిన అది పవన్ స్టామినాకు తక్కువ అని చెప్పాలి.
బ్రో సినిమా రికార్డుల విషయాన్ని ఆలోచించకపోవడమే మంచిదని అంటున్నారు అభిమానులు. మామూలుగా స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే వాటికి భారీగా రేట్లు పెంచుతారు కానీ బ్రో కు అలా చేయలేదు. రెండు రాష్ట్రాలలోనూ సాధారణ టికెట్ ధరలు పెట్టారు. రీసెంట్గా వచ్చిన బేబీ సినిమా బాగా ఆడుతుంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. అలానే మల్టీప్లెక్స్ లోను సక్సెస్ఫుల్గా ఆడుతున్న మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీ చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. తాజాగా విడుదలైన హిందీ సినిమా ‘ రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని కి కూడా హైదరాబాదులో స్క్రీన్ లు బాగానే దక్కాయట. దీంతో బ్రో సినిమాకు భారీ స్క్రీన్ షోలు దొరకలేదు. ఇది కూడా బ్రో సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పాలి.