Ghani Movie Review : వరుణ్ తేజ్ గని మూవీ రివ్యూ , రేటింగ్..!
Ghani Movie Review: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ దాదాపు రెండేళ్ల తర్వాత గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
Ghani Movie Review : గని మూవీ రివ్యూ .. కథ
వరుణ్ తేజ్ ఇప్పటివరకు మాస్ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ మూవీస్‌లో నటించినా కూడా గని లాంటి స్పోర్ట్స్ డ్రామాను మాత్రం చేయలేదు. తొలిసారి ఇలాంటి మూవీ చేసిన వరుణ్ తేజ్ చిన్నతనం నుండి బాక్సర్ అవ్వాలని తన కోరిక,దానికోసం ఎంతో కస్టపడి శిక్షణ తీసుకుంటాడు, అయితే అనుకోని కారణాల వాళ్ళ గని అమ్మ బాక్సింగ్ వదిలేయమని అతని దగ్గర ఒట్టు వేయించుకుంటుంది. అయితే మళ్లీ అతను బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతాడు. అలాంటి కొందరు గనికి అడ్డపడుతుంటారు. వారిని ఎలా ఎదిరించి గెలిచాడన్నదే కథ.
Ghani Movie Review : గని మూవీ రివ్యూ .. నటీనటుల పనితీరు
వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. ప్రతి ఫ్రేములోను అద్భుతంగా నటించాడు. నటుడిగా మరో లెవల్‌కి వెళ్లాడని చెప్పాలి. కథానాయికగా సయి మంజ్రేకర్ ఆకట్టుకుంది.మిగతా పాత్ర ధారులు కూడా తమ పాత్ర పరిది మేర నటించారు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయంకే ఎక్కువ టైం పడుతుంది. దీనితో అసలైన కథ మొదలు కావడానికి బాగా ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సో సో గా సాగుతుందని ప్రేక్షకులు అంటున్నారు
కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేషాలు కూడా బాగా పండాయి. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది, సెకండాఫ్‌లోనే అసలు స్టోరీ ఉంది. ఉపేంద్ర ఎంట్రీతో సినిమా టర్న్ అయింది. నవీన్ చంద్ర, వరుణ్ తేజ్ మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ పరంగా చూస్తే.. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఒక మంచి కథ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు, అయితే ఒక మంచి కథని కమర్షియల్ గా చెప్పడం అంత తేలికైన విషయం కాదు, కానీ అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరిస్తూనే తాను చెప్పాలి అనుకున్నది చెప్పడం లో కాస్త విఫలం అయ్యారనే చెప్పాలి. జార్జ్ సి విల్లియమ్స్ కూడా సినిమాకి చాల మంచి విజుఅల్స్ అందించారు, ఇంతకముంది వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాకి కూడా ఈయనే ఛాయాగ్రాహకుడు, అయితే థమన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటన
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథనం
ఫస్టాఫ్
విశ్లేషణ: సినిమాలో స్పోర్ట్స్ డ్రామాకు కావలసిన కొత్తదనం లేదు.. ఓవరాల్ గా రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. వరుణ్ తేజ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. మెగా ఫ్యాన్స్‌ని మాత్రమే ఈ సినిమా అలరిస్తుంది.