Matka Movie Review : వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Matka Movie Review : వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi , నవీన్ చంద్ర Naveen Chandra , అజయ్ ఘోష్, కిశోర్ సంగీతం : జి.వి ప్రకాష్ సినిమాటోగ్రఫీ : ఏ కిషోర్ కుమార్ ఎడిటింగ్ : కార్తిక్ శ్రీనివాస్ ప్రొడక్షన్ : వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : విజేందర్ రెడ్డి గీగల, రజని తాళ్లూరి   Matka Movie Review  మెగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Matka Movie Review : వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi , నవీన్ చంద్ర Naveen Chandra , అజయ్ ఘోష్, కిశోర్

సంగీతం : జి.వి ప్రకాష్

సినిమాటోగ్రఫీ : ఏ కిషోర్ కుమార్

ఎడిటింగ్ : కార్తిక్ శ్రీనివాస్

ప్రొడక్షన్ : వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : విజేందర్ రెడ్డి గీగల, రజని తాళ్లూరి

 

Matka Movie Review  మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మట్కా. ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడగా సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా నోరా ఫతేహి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథను కరుణ కుమార్ రతన్ కత్రె జీవిత అంశాల నుంచి స్పూర్తి పొందాడని తెలుస్తుంది. సినిమా 1950 నుంచి 1980 వైజాగ్ నేపథ్యంతో నడుస్తుంది.

మట్కా ఆట నేపథ్యంతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. తను చేయని తప్పుకి జైలుకి వెళ్లిన వాసు అక్కడ మనీ లేనిదే ఏది లేదని గుర్తిస్తాడు. దాని వల్ల అతను ఎలాంటి పనులు చేశాడు. ఎలా ఎదిగాడు.. అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా అధిగమించాడు అన్నదే మట్కా కథ.

ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై మంచి బజ్ ఏర్పరిచాయి. కచ్చితంగా సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో మైన్ స్టోన్ మూవీగా నిలిచేలా ఉంటుందని డైరెక్టర్ కరుణ కుమార్ చెబుతున్నారు. మరో 20 ఏళ్ల తర్వాత కూడా వరుణ్ తేజ్ మట్కాలో యాక్టింగ్ గురించి చెప్పుకుంటారని అంటున్నారు. మరి అదెలా ఉంటుందో రేపు సినిమా చూస్తే అర్ధమవుతుంది.

Matka Movie Review వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్

Matka Movie Review : వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సినిమాలు ఏవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే మట్కా విషయంలో మేకర్స్ అంతా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈమధ్యనే లక్కీ భాస్కర్ తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి లక్ కూడా మట్కాకు తోడై ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. మట్కా లో వరుణ్ తే డిఫరెంట్ వేరియేషన్స్ తో అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలతో ఉన్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ మీనాక్షి చౌదరి కలిసి జంటగా నటించిన సినిమా మట్కా. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి. గద్దలకొండ గణేష్ తర్వాత సరైన సక్సెస్ లు లేని వరుణ్ తేజ్ మట్కాతో తను అనుకున్న సక్సెస్ అనుకున్నాడా లేదా.. నేడు రిలీజ్ అయిన మట్కా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

Matka Movie Review కథ :

బర్మా నుంచి వచ్చిన వాసు చేయని తప్పుకి జైలు పాలవుతాడు. అక్కడ డబ్బు లేనిదే ఏమీ చేయలేమని తలచి డబ్బు సంపాదించడం ఎలా అని వేట మొదలు పెడతాడు. ఆ టైంలో అతనికి మట్కా తెలుస్తుంది. దాన్ని ఉపయోగించి అతను ఎలా ఎదిగాడు. అతని ప్రత్యర్ధులు అతన్ని ఎలా పడగొట్టాలని అనుకున్నారు. చివరికి మట్కా కింగ్ గా వాసు ఎలా తన సమస్యలను సాల్వ్ చేసుకున్నాడు అన్నది సినిమా కథ.

Matka Movie Review విశ్లేషణ :

మట్కా కింగ్ రతన్ కత్రి కథతో వైజాగ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ కరుణ కుమార్. సినిమా మొత్తం 1958 నుంచి 1982 మధ్యలో తెరకెక్కించారు. ఆ టైం పీరియడ్ కి సంబందించిన అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. ఇక వరుణ్ తేజ్ క్యారెక్టర్ వేరియేషన్స్ అదరగొట్టాడు.వాసు పాత్రలో వరుణ్ తేజ్ తన వర్సటాలిటీ చూపించారని చెప్పొచ్చు. డైరెక్టర్ తను రాసుకున్న కథను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. మధ్య మధ్యలో ఫ్లాస్ ఉన్నా కూడా సినిమాకు అవేవి అడ్డుగా నిలబడలేదు. మరో పక్క స్క్రీన్ ప్లే కూడా సినిమాను ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. మట్కా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లో అయినట్టు అనిపించినా చివర్లో మళ్లీ ఊపందుకుంటుంది. సినిమా మొత్తం డిఫరెంట్ వరల్డ్ లో జరిగినట్టుగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ సినిమాకు బలంగా మారింది. ఐతే అక్కడక్కడ స్లో అవ్వడం కొంత కన్ ఫ్యూజన్ సీన్స్ ఆడియన్స్ కి సినిమాపై కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తాయి. ఫైనల్ గా కొత్త సినిమాను చూడాలని కోరుకునే వారికి మట్కా నచ్చేస్తుంది.

నటన & సాంకేతిక వర్గం :

వరుణ్ తేజ్ టాప్ క్లాస్ యాక్టింగ్ సినిమాను నిలబెట్టింది. అతని క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్స్ బాగున్నాయి. తనకు వచ్చిన ఛాన్స్ ని వరుణ్ తేజ్ అన్ని విధాలుగా వాడుకున్నాడు. మీనాక్షి చౌదరికి కూడా మంచి పాత్ర పడింది. నోరా ఫతేహి కూడా ఇంప్రెస్ చేసింది. మిగతా పాత్రదారులంగా మెప్పించారు.

సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ బిజిఎం ఆకట్టుకున్నాడు. కిషోర్ కుమార్ కెమెరా వర్క్ పీరియాడికల్ అప్పీల్ తో ఇంప్రెస్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సెట్ వర్క్ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ అక్కడక్కడ ట్రాక్ తప్పాడు కానీ ఫైనల్ గా సినిమాను నిలబెట్టాడు.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్

స్క్రీన్ ప్లే

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవ్వడం

సాంగ్స్

బాటం లైన్ :

మట్కా కింగ్ వరుణ్ తేజ్ ఖాతాలో సక్సెస్ వచ్చినట్టే..!

రేటింగ్ : 2.5/5

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది