Bhimaa Movie Review : భీమా మూవీ రివ్యూ టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా గోపీచంద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఇటీవల ఆయన సినిమాలన్ని ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే తర్వాతి మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ రకంగా గోపీచంద్ హీరోగా రేసులో వెనుకబడుతున్నారు. అయినా మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా హీరోగా సత్తా చూపెడుతూనే ఉన్నారు. ‘ సిటీమార్ ‘ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ‘ పక్కా కమర్షియల్ ‘ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన ‘ రామబాణం ‘ సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులు అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు గోపీచంద్ ఆచితూచి సినిమాలు చేసేందుకు అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు హర్ష డైరెక్షన్లో ‘ భీమా ‘ సినిమా చేశారు.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే.కే.రాధా మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించారు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. రవి బస్సూర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ మరోసారి పోలీస్ పాత్రలో నటించినట్లుగా ఉన్నారు. మరోవైపు భీమా టైటిల్ తోనే ఈ సినిమా మాస్ వైబ్రేట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మరోసారి గోపీచంద్ కం బ్యాక్ అవుతారా లేదా అనేది చూడాలి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకి హింసాత్మక దృశ్యాల కారణంగా ‘ ఏ ‘ సర్టిఫికెట్ ను జారీ చేశారు. అయితే సెన్సార్ టాక్ ప్రకారం చాలా రోజుల తర్వాత పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో గోపీచంద్ యాక్షన్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తోంది.
అలాగే ఈ సినిమాని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకి స్పెషల్ షో వేయడం జరిగిందట. వారి టాక్ ప్రకారం భీమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. ఇంటర్వెల్ బ్లాక్ పరవాలేదు అంటున్నారు. సెకండ్ హాఫ్ రోటీన్ గా ఉన్నప్పటికీ ఒక ట్విస్ట్ అలరించే విధంగా ఉంటుందట. క్లైమాక్స్ లో వీఎఫ్ఎక్స్ బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా భీమా సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన గోపీచంద్ సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని అంటున్నారు. గోపీచంద్ కి మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. భీమా సినిమాలో కూడా గోపీచంద్ మాస్ యాక్షన్ సీన్లలో అద్భుతంగా నటించారని అంటున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో గోపీచంద్ యాక్షన్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.
మహేంద్రగిరిలో భవాని ( ముఖేష్ తివారి) కి తిరుగు ఉండదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీస్ అధికారులు అయినా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర టాంకర్ల జోలికి ఎవరొచ్చినా అస్సలు ఊరుకోడు. ఒక ఎస్సై ( కమల్ కామరాజు) ను చంపేస్తాడు. ఆ తర్వాత భీమా ( గోపీచంద్ ) ఎస్సైగా వస్తాడు. వచ్చి రావడంతో భవానీకి వార్నింగ్ ఇస్తాడు. భవాని మనిషులను టార్గెట్ చేస్తాడు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు. భవాని ట్యాంకర్లలో రహస్యం ఏమిటి ..? ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ ( నాజర్ ) ఏం చేశాడు ..? విద్య ( మాళవిక శర్మ) వల్ల భీమా జీవితంలో ఏం జరిగింది..? రామ ( గోపీచంద్ ) , పారిజాతం ( ప్రియా భవాని శంకర్ ) ఎవరు..? భీమా మీద విజయం కోసం భవాని తన బలం, బలగాన్ని మహేంద్రగిరిలో దించడంతో ఏం జరిగింది..? వీళ్లకు మహేంద్రగిరిలోని పరుశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా మూతపడిన శివాలయానికి సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గోపీచంద్ ఇంతకుముందు చేసిన పోలీస్ సినిమాలకు భీమాకు చాలా డిఫరెన్స్ ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్ కథను కొత్తగా చూపించింది. అయితే హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు తలపించింది. ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 15 నిమిషాల వరకు హీరోని చూపించలేదు. పరశురామ క్షేత్రం లో జరిగే పూజల గురించి వివరించారు. అప్పుడు ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది. హీరో పరిచయం అయిన తర్వాత ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు మళ్లీ గుడి ప్రస్తావన ఉండదు. హీరో పరిచయం తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మారింది. భీమా, విద్య లవ్ ట్రాక్ బాలేదు. మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్లు ఉన్నారు. రామ , పారిజాతం లవ్ ట్రాక్ కూడా కొత్తగా లేదు. ప్రేమ కథలు కామెడీ సీన్లు బాగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. రవి బస్రూర్ పాటల కంటే నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. యాక్షన్ సీన్లకు చేసిన రీ రికార్డింగ్ బాగుంది. గోపీచంద్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. స్వామి జె గౌడ సినిమా ఆటోగ్రఫీ మాస్ సినిమాకు కావలసిన మూడ్ స్క్రీన్ మీద చూపించింది. నిర్మాత కేకే రాధా మోహన్ ఖర్చుకు వెనకాడ లేదు. ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాల విషయంలో ఎడిటింగ్ పరంగా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక గోపీచంద్ రెండు లుక్స్ లో కనిపించారు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే హ్యాండ్సమ్ గా స్లిమ్ గా ఉన్నారు. హుషారుగా కనిపించారు. ఎనర్జీ చూపించారు. పోలీస్ పాత్రలో మీసకట్టు, రామా పాత్రలో పొడవాటి జుట్టుతో డిఫరెంట్ చూపించారు. హీరోయిన్ మాళవిక శర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మాస్ ఆడియన్స్ కోసం అన్నట్టు ఆమె గ్లామరస్ గా కనిపించారు. ప్రియా భవాని శంకర్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమా కథ ఎక్కువ హీరో చుట్టు నడుస్తుంది. మిగతా పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంది అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ల తరహాలో ఉంటాయి. ముఖేష్ తివారి బాహుబలి లో బిజ్జాలదేవ టైపులో బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. రవీంద్ర వర్మ గా పాత్రకు తగ్గట్టు నాజర్ నటించారు. రఘుబాబు, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ , సప్తగిరి, సరయు చమ్మక్ చంద్ర సహా కొందరు కమెడియన్స్ ఉన్నారు. సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీను పడలేదు. డైరెక్టర్ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం ముగింపు బాగా రాసుకున్నారు. మధ్యలో సో సో సీన్లతో నింపేశారు. గోపీచంద్ చాలా వరకు సినిమాను నిలబెట్టారు. చివరి 30 నిమిషాల్లో అసలు కథ ఉంది. అరగంట గోపీచంద్ నటన క్లైమాక్స్ యాక్షన్ సీన్లు నచ్చుతాయి…
ప్లస్ పాయింట్లు :-
గోపీచంద్ నటన
క్లైమాక్స్
యాక్షన్
మైనస్ పాయింట్లు :-
రొటీన్ పాత్రలు
లవ్ ట్రాక్
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.