Categories: ExclusiveNewsReviews

Gaami Movie Review : విశ్వ‌క్ సేన్‌ గామి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Advertisement
Advertisement

Gaami Movie Reviewగామి మూవీ రివ్యూ | టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విశ్వ‌క్ సేన్‌. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ విశ్వ‌క్ సేన్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ గత సినిమా ధమ్కి, ఓరి దేవుడా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు వచ్చే ‘ గామి ‘ సినిమాపై కూడా అభిమానుల్లో అంతే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక గామి సినిమాను విద్యాధర కాగిత దర్శకత్వం వహించారు. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యులాయిడ్ , వీఆర్ గ్లోబల్ మీడియా క్లౌన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించగా శ్వేత మొరవనేని సహనిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చాందిని చౌదరి నటించారు. ఇక అభినయ కీలక పాత్ర పోషించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు.

Advertisement

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మైథాలాజికల్ టచ్ ఉంది కాబట్టి శివుడి భక్తులు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేయటం కూడా జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం గామి సినిమాలో విశ్వక్సేన్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఊహించని సంఘటన వలన అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి. అందుకు అభినయా ఎలా కారణమైంది. విశ్వ‌క్ సేన్‌ హిమాలయాలకు ఎందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతనికి చాందిని చౌదరి మధ్య పరిచయం ఎలా అయిందనేది గామి కథ అని తెలుస్తుంది.

Advertisement

ఇక సినిమాలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ వద్ద విజువల్స్ మంచి ట్రీట్ ఇస్తాయట. సెకండ్ హాఫ్ లో మెయిన్ ఫ్లాట్ రివీల్ అవుతుందనిమ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని అంటున్నారు. గామి కి సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఆయువు పట్టు అని అంటున్నారు. మొత్తానికి గామి సినిమా శివరాత్రి పండుగ రోజు చూడవలసిన సినిమా అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో తొలిసారిగా విశ్వక్సేన్ అఘోర పాత్రల కనిపించబోతుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా విశ్వ‌క్ సేన్‌ కెరియర్ ప్రారంభంలో మొదలైన సినిమా కాబట్టి చాలెంజింగ్ ప్రాజెక్టే. ఈ సినిమాలో విశ్వక్సేన్ నటన ఎలా ఉండబోతుందో కచ్చితంగా చూడాలని అంటున్నారు. ఇక డైరెక్టర్ విద్యాధర కాగిత ఈ సినిమా కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ఇతను తన మొదటి సినిమా గామి కోసం చాలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

Gaami Movie Review  కథ :

‘ గామి ‘ సినిమాలో మూడు కథలు పార్లల్ గా నడుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక అఘోరాగా నటించారు. ఇక ఆయన్ని ఎవరు ముట్టుకొని ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అలాగే అభినయకు సంబంధించిన ఒక స్టోరీ అనేది సినిమాలో పార్ట్ గా నడుస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే విశ్వక్ సేన్ తనకున్న ఆ జబ్బు పోవాలంటే 36 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆయనకి ఉన్న ఆ జబ్బు పోయి ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్తారు. ఈ క్రమంలోనే తాను హిమాలయాలకు బయలుదేరతాడు. ఈ ప్రాసెస్ లోనే అతడికి చాందిని చౌదరి కలుస్తుంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటి? చాందిని విశ్వక్ సేన్ కి ఎందుకు సహాయం చేస్తుంది. ఈ మూడు కథలను కలుపుతూ డైరెక్టర్ అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన జబ్బును పోగొట్టుకున్నాడా లేదా చివరికి ఏం జరిగిందో తెలియాలంటే సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

Gaami Movie Review  విశ్లేషణ :

డైరెక్టర్ విద్యాధర్ కాగిత రాసుకున్న స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక ఆ స్టోరీకి అనుకూలంగానే స్క్రీన్ ప్లే ని కూడా చాలా కొత్తగా రాసుకున్నాడు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు చాలా గ్రిప్పింగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఒకే స్క్రిప్ట్ మీద ఆయన ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఆరు సంవత్సరాలు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సినిమా పూర్తిచేసి విడుదల చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో డైరెక్టర్ ఓపికను మెచ్చుకోవచ్చు. అయితే ఈ సినిమాలో విద్యాధర్ చూపించిన సన్నివేశాలు కానీ విశ్వక్ సేన్ యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రతి ఒక్క పాత్రని రాసుకున్న విధానం చాలా బాగుంది. ఇక కొన్ని సీన్లని హై లో చూపించడంలో దర్శకుడు కొద్దిగా తడబడ్డట్టుగా అనిపించినప్పటికీ ఆ సీన్ యొక్క డెప్త్ ను చెడగొట్టకుండా సినిమాని చూసి ప్రేక్షకులలో ఈ సినిమా తాలూకు ఒక మూడ్ అయితే క్రియేట్ చేయగలిగాడు. ఇలాంటి ఒక ఎక్స్పరిమెంటల్ సినిమాని అసలు ఎక్కడ డివియేషన్స్ లేకుండా అతను ఎంచుకున్న పాయింట్ తెరమీద చూపిస్తూ కథను హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ లు ఇంకా వస్తే సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త పుంతలు తొక్కుతుంది అనేది మాత్రం వాస్తవం. అయితే విశ్వక్ సేన్ క్యారెక్టర్ మీదనే డైరెక్టర్ సినిమాను రన్ చేశాడు కానీ అభినయ క్యారెక్టర్ లో కూడా ఇంకా డెప్త్ ని చూపిస్తే బాగుండేది.

అలా చేయకుండా చాలా సేపు విశ్వక్ సేన్ మీదే స్క్రీన్ పై నడవడం వలన సినిమా చూసే ఆడియన్స్ కి కొన్నిసార్లు బోర్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అలాగే అభినయ క్యారెక్టర్ లో డెప్త్ ఉంది. ఇక విశ్వక్ సేన్ ఒక కొత్త క్యారెక్టర్ చాలెంజింగ్ తీసుకొని మరి నటించినట్లుగా తెలుస్తుంది. ఇది ఆయనకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఇలాంటి పాత్రను పోషించడం అంతా ఈజీ కాదు. అందులో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక జబ్బుతో బాధపడే వ్యక్తి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది కూడా మన కండ్లగా కట్టినట్లుగా తన నటనతో చూపిస్తూ ఎమోషన్స్ ని కూడా బాగా డీల్ చేస్తూ నటించాడు. ఇక హీరోయిన్ చాందిని చౌదరి నటన కూడా మెప్పించింది. ఇక అభినయ చాలా చక్కని పర్ఫామెన్స్ ఇచ్చింది. వీళ్ళతోపాటు మిగిలిన వాళ్లంతా పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక నరేష్ కుమారన్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపించింది. బీజీఎం సినిమాలోని సన్నివేశాలని ఎలివేట్ చేయడంలో బాగా హెల్ప్ అయింది. అలాగే ప్రేక్షకుడిలో ఆ సినిమా తాలూకు ఒక మూడ్ క్రియేట్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సినిమా ఆటోగ్రాఫర్ విశ్వనాథరెడ్డి అందించిన విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో అయినా విజువల్స్ అనేవి ప్రేక్షకుడిని కట్టిపడేసాయి. రాఘవేంద్ర ఎడిటింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సినిమాకి రీచ్నెస్ ను తీసుకొచ్చాయి. ప్రతి షాట్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైలో కనిపిస్తుంటాయి.

ప్లస్ పాయింట్లు :-
కథ
విశ్వక్ సేన్ నటన

మైనస్ పాయింట్స్ :-

కొన్ని సీన్లు బోర్

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.