Hari Hara Veera Mallu Movie Review : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబురాలు..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu Movie Review : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబురాలు..!
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్ కళ్యాణ్ నటించిన Hari Hara Veera Mallu Movie హరి హర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో bobby deol బాబీ డియోల్, nidhi agarwal నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి Kiravani సంగీతం అందించారు. Hari Hara Veera Mallu Review హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అమెరికాలో 450 లోకేషన్లలో 500 స్క్రీన్లకుపైగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. సినీ మార్క్, ఏఎంసీ, రీగల్, మార్కస్, సినీ లాంజ్, ఇతర స్క్రీన్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ స్క్రీన్లలో సుమారుగా 450K డాలర్లు అంటే సుమారుగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని యూఎస్ డిస్డిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది.

Hari Hara Veera Mallu Movie Review : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబురాలు..!
Hari Hara Veera Mallu Movie Review : రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబురాలు
ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయని డిస్టిబ్యూటర్లు తెలుపుతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రీ రెంట్రీ తర్వాత పవన్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.అలాగే రీ ఎంట్రీ తర్వాత చేసిన మొదటి స్ట్రైట్ మూవీ. అలాగే కెరీర్లో మొదటిసారి ఆయన ఓ గజదొంగగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ ను… పవన్ డైరెక్షన్ కూడా చేశారని దర్శకులు జ్యోతి కృష్ణ తెలిపారు.ఆ సీక్వెన్స్ కోసం పవన్ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి సినిమా ఇది. కాబట్టి.. ఆయన గెలుపుని అభిమానులు థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాని 80 శాతం క్రిష్ డైరెక్ట్ చేయడం జరిగింది. విజువల్స్ కూడా పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ఉంటాయి. ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్లో కూడా విజువల్స్ హైలెట్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు రత్నం. పవన్ కళ్యాణ్ మార్కెట్ ను మించి ఆయన ఖర్చు పెట్టారని చెప్పాలి. ట్రైలర్లో విజువల్స్ అదిరిపోయాయి. సినిమాలో కూడా అదే రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది.ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ కనిపించబోతున్నారు. ఈయన పాత్ర కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అంటున్నారు.
2022 లో వచ్చిన ‘హీరో’ తర్వాత నిధి నుండి మరో సినిమా రాలేదు. ‘హరిహర వీరమల్లు’ లో ఆమె చేసిన పంచమి పాత్రని బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. భరతనాట్యం, గుర్రపు స్వారీలు కూడా ఈమె ప్రాక్టీస్ చేసిందట ఈ సినిమా కోసం. కచ్చితంగా ఈమె పాత్ర అందరినీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పవన్ అభిమానులకు కావాల్సిన గూజ్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉంటాయట. అలాగే క్లైమాక్స్ కూడా వావ్ ఫ్యాక్టర్ తో నిండి ఉంటుంది అని సమాచారం.
నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు.
దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ
నిర్మాణం : మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం : ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్
ఎడిటింగ్ : ప్రవీణ్ కే ఎల్
Hari Hara Veera Mallu Movie Review కథ :
1650 కొల్లూరు ప్రాంతం లో మొగులుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్నారు. అయితే అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగిలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) సొంతం అని గోల్కొండ నవాబ్ కుతుబ్ షా (దలీప్ తహిల్) వీరని తన దగ్గరకి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి ఇక్కడ నుంచి వీరమల్లు ఎలా సవాళ్ళని ఎదుర్కొన్నాడు? అసలు ఈ వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Hari Hara Veera Mallu Movie Review పర్‌ఫార్మెన్స్ :
ప్లస్ పాయింట్స్:
నిర్మాత ఏ ఎం రత్నం ఓ సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించాడు.. తన గడిచిన నాలుగైదు సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియెన్స్ చూస్తారు. కొన్ని కొన్ని చాలా సింపుల్ గా చేసేసారు కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం ఇష్టం రెండూ కనిపిస్తాయి. నిధి అగర్వాల్ తన రోల్ లో చాలా బాగా నటించింది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు. తమ పాత్రల్లో మెప్పించారు. బాబీ డియోల్ నుంచి మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ ఇది అని చెప్పవచ్చు.
గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్స్ గాని బాగానే ఉన్నాయి కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్స్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి . తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మూమెంటం కొనసాగిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ సెకండాఫ్ లో కొంచెం చూసుకోవాల్సింది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరూ కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్:
పవన్ నటన
కీరవాణి సంగీతం
బాబీ డియోల్ పర్‌ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్
కథనం
విజువల్ ఎఫెక్ట్స్
తీర్పు:
హరిహర వీరమల్లు సినిమాలో మంచి పాయింట్ ఉంది దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే కానీ కొన్ని చోట్ల కథనం ఊహాజనిత తరహాలోనే కొనసాగుతుంది. అలాగే సెకండాఫ్ లో మాత్రం మాస్ అండ్ ఎలివేషన్ మూమెంట్స్ కొంచెం డల్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి దానికి చూపించే విజువల్స్ కి అసలు పొంతన లేదు. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ అందించలేకపోయారు. సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవంఈ సినిమా అని చెప్పవచ్చు. సెకాండఫ్ లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్, డిజప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
రేటింగ్ : 3/5