Categories: NewsReviews

Junior Movie Review : జూనియ‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Junior Movie Review  : ‘కిరీటి రెడ్డి’..  Kireeti  sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే ‘వైరల్ వయ్యారి’ అంటూ సాంగ్ ప్రోమో రిలీజైందో.. శ్రీలీల పక్కన ఎవడ్రా ఆ కుర్రాడు కత్తిలా డ్యాన్స్ చేయడంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ రోజు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం. క‌థ‌: విజయనగరం అనే ఊరిలో ఉండే కోదండపాణి (వీ రవిచంద్రన్), శ్యామల దంపతులు లేటు వయసులో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే శుభ‌వార్త వింటారు. అయితే పల్లెటూరు కావడంతో ఈ వయసులో పిల్లలేంటి విమ‌ర్శిస్తుంటారు.. దాంతో ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్లిపోదామని గర్భంతో ఉన్న తన భార్యని తీసుకొని బస్సు ఎక్కుతాడు కోదండపాణి. అయితే అనుకోకుండా అదే బస్సులో ప్రసవం అయి బిడ్డని తన చేతిలో పెట్టి కోదండపాణి భార్య చనిపోతుంది.ఆ రోజు నుంచి తన కొడుకు అభి (కిరీటి రెడ్డి)ని అన్నీ తానై అమ్మలా లాలించి ఎలాంటి లోటు లేకుండా పెంచుతాడు కోదండపాణి.. ప్రతి పని దగ్గరుండి బొమ్మరిల్లు ఫాదర్‌లా చేయించడం చూసి అభికి విసుగొస్తుంది. దీంతో తండ్రి నుంచి దూరంగా ఉండాలని సిటీకి వచ్చి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. సరిగ్గా అప్పుడే కాలేజీలో స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. నాలుగేళ్ల పాటు ఆమె వెనకాల తిరిగి చివరికి స్పూర్తి పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు అభి. అయితే అక్కడ సీఈఓ విజయ సౌజన్య (జెనీలియా)కి మొదటి నుంచి అభి అంటే పడదు. దీంతో ఇద్దరి మధ్యా నువ్వా-నేనా అన్నట్లుగా సీన్ మారుతుంది. ఆ త‌ర్వాత క‌థ ఏంట‌న్న‌ది వెండితెర‌పై చూడాల్సిందే…

Junior Movie Review : జూనియ‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Junior Movie Review  : న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్

లాంచ్ సినిమాలో కిరీటి న‌ట‌న, డ్యాన్స్‌ల‌తో ఏమాత్రం నిరాశపరచలేదు. నిజానికి ఇదే అతని ఫస్ట్ సినిమా అన్నట్లు అయితే ఖచ్చితంగా లేదు. ఎమోషనల్ సీన్లలో కూడా పరిణితి ఉన్న నటుడిగా మెప్పించాడు. కిరీటి డ్యాన్సుల్లో, యాక్టింగ్‌లో తారక్ అప్పుడప్పుడూ అలా మెరిసినట్లు అనిపించింది.దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చింది జెనీలియా. ఈ సినిమాలో చాలా బలమైన క్యారెక్టర్‌ని అంతే ఈజ్‌తో చేసింది. అల్లరి పిల్ల హాసినిగా అప్పుడు అందరినీ నవ్విస్తే ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆలోచింపజేసింది. ఇక శ్రీలీల పాత్రకి యాక్టింగ్‌ స్కోప్ అయితే పెద్దగా లేదు. గ్లామర్ ట్రీట్‌కి, డ్యాన్సుల కోసం మాత్రమే శ్రీలీలని పెట్టినట్లు అనిపించింది. సినిమాలో మరో ప్రధానమైన పాత్ర హీరో తండ్రి కోదండపాణి. ఈ క్యారెక్టర్‌ని వీ రవిచంద్రన్ అద్భుతంగా చేశారు. ఎమోషనల్ సీన్లలో ఆయన యాక్టింగ్ చాలా బావుంది. కంపెనీ ఛైర్మన్ గోపాల్ పాత్రలో రావు రమేష్ హుందాగా కనిపించారు. ఎమోషనల్ సీన్లలో ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక వైవా హర్ష, సత్య, సుమన్ శెట్టి వాళ్ల పాత్రలకి న్యాయం చేశారు.

నటులు:కిరీటి రెడ్డి,శ్రీలీల,జెనీలియా,రావు రమేష్,వీ రవిచంద్రన్
దర్శకుడు: రాధాకృష్ణ రెడ్డి
వ్యవధి:2 Hrs 34 Min
సంగీతం : దేవి శ్రీ ప్ర‌సాద్

Junior Movie Review  టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్

సినిమాలో ఎమోషన్ ఉంటే.. దానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఎందుకంటే బీజీఎమ్‌తో ప్రేక్షుకుల కళ్లల్లో నీళ్లు తెప్పించేశాడు. జూనియర్‌లో పాటలు అంత ఇంపాక్ట్ (వైరల్ వయ్యారి, క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్ మినహా) చూపించకపోయినా బీజీఎం విషయంలో మాత్రం డీఎస్పీ ఇరగదీశారు. ఎమోషనల్ సీన్లకి ఆయన ఇచ్చిన బీజీఎం సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పనితనం గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన వర్క్ కనిపించింది. ద‌ర్శ‌కుడు కూడా ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తీసాడు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా స‌రిగ్గా క‌ట్ చేశారు.

ప్ల‌స్ పాయింట్స్:

ఎమోష‌న‌ల్ సీన్స్
వైర‌ల్ వ‌య్యారి పాట‌
కిరిటీ డ్యాన్స్, జెనీలియా న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:

రొటీన్ సీన్స్
క‌థ‌
ఊహాకి అందే సీన్స్

చివరిగా..

ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఆ ఏముందిలే రొటీన్ లవ్‌స్టోరీ అంతకంటే ఏముంటుంది కొత్తగా అన్న మాట ఎక్కువ వినిపించింది. నిజానికి అదే ఈ సినిమాకి ప్రధాన బలం అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త హీరో ఏం చేస్తాడో చూద్దామనే ఆలోచనతోనే ఎక్కువమంది ఆడియన్స్ థియేటర్‌కి వెళ్తారు. వారిని ‘జూనియర్’ అన్ని విధాలుగా సాటిస్‌ఫై చేశాడు. ఫస్టాఫ్ కాస్త పడుతూ లేస్తూ సరదాగా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్‌తో సినిమా సెకండాఫ్‌కి మంచి అంచనాలతో ప్రేక్షకుడికి స్వాగతం పలికారు. ఆ అంచనాల్ని ఎక్కడా తగ్గించకుండా సెకండాఫ్ ఉంది. ఈ సినిమాకి ప్రధాన బలం ఎమోషన్‌యే. తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు మధ్య రాసుకున్న ప్రతి సీన్ చాలా బలంగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ పనితీరు స్క్రీన్‌పై క్లియర్‌గా కనిపించింది. కథ బ్యాక్ డ్రాప్ విలేజ్‌కి వెళ్తుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ పెరిగింది. అప్పటివరకూ ఒకరంటే ఒకరికి పడని అభి-విజయల మధ్య దూరం తగ్గడం.. ఇద్దరూ కలిసి ఆ గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం.. ఈ సీన్లు అన్నీ థియేటర్లో బాగా వర్కవుట్ అయ్యాయి. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా ఇచ్చిన చిన్న ట్విస్ట్ సినిమాకి ప్లస్ అయింది. వైరల్ వయ్యారి పాటలో మాత్రం ఎవరిని చూడాలిరా అన్నట్లుగా డ్యాన్స్ చేశారు శ్రీలీల‌, కిరీటి

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago