KGF Chapter 2 Movie Review : కేజీఎఫ్.. ఈ వర్డ్స్ వింటేనే ఒంట్లో ఏదో తెలియని ఒక పరవశం. అవును.. కేజీఎఫ్ అనే మూడు అక్షరాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోట్లో నానుతున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 పేరుతో విడుదలైన మూవీ ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది.
ఆ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 పేరుతో ఇవాళ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మీద విపరీతంగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే సినిమాకు భారీగా హైప్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ లో వేశారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాలో రాకీగా నటించాడు. బాహుబలి సిరీస్ తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెండో సీక్వెల్ సినిమా ఇది. చాప్టర్ వన్ కు విడుదలకు ముందే ఈ రేంజ్ క్రేజ్ లేదు. కానీ.. చాప్టర్ 2 సినిమాకు మాత్రం విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. అందుకే పాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్ చాప్టర్ 2ను రిలీజ్ చేస్తున్నారు. తొలి రోజు భారీ వసూళ్లు చేసే దిశగా కేజీఎఫ్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా థర్డ్ పొజిషన్ లో ఉంది. ఒకవేళ తొలి రోజు వసూళ్లు భారీగా ఉంటే రెండో సినిమాగా చరిత్రకెక్కనుంది. మరి కేజీఎఫ్ చాప్టర్ వన్ తో పోల్చితే చాప్టర్ 2 లో ఉన్న స్పెషాలిటీ ఏంటి.. అనే విషయం తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
నటీనటులు : యష్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, తదితరులు
కథ, దర్శకత్వం : ప్రశాంత్ నీల్
నిర్మాత : హోంబలే ఫిలింస్
రిలీజ్ తేదీ : 14 ఏప్రిల్ 2022
విడుదలయిన భాషలు : కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ
చాప్టర్ వన్ సినిమా ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచి సెకండ్ పార్ట్ ప్రారంభం అవుతుంది. మొదటి పార్ట్ గరుడను చంపడంతో ముగుస్తుంది. గరుడ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ కార్మికులు రాకీని చూసి సంతోషిస్తారు. ఆ కేజీఎఫ్ కు అతడే కింగ్ అవుతాడు. ఇంకా ఇలాంటి కేజీఎఫ్ లు చాలా ఉన్నాయని రాకీకి తెలుస్తుంది. దీంతో వాటినీ తన గుప్పిట్లో తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే.. రీనా(నిధి శెట్టి) తండ్రి రాజేంద్ర దేశాయ్, రాకీ చంపేసిన గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ అందరూ చేతులు కలుపుతారు. ఈ విషయం రాకీకి తెలుస్తుంది. ముందు రీనాను తనతో పాటు కేజీఎఫ్ కు తీసుకెళ్తాడు రాకీ. రాకీ అక్కడే ఉండటంతో… వీళ్లకు అక్కడికి వెళ్లే చాన్స్ రాదు. దీంతో రాకీనే కేజీఎఫ్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు రాజేంద్ర దేశాయ్ వాళ్లు.
అప్పుడే అధీరా గురించి వాళ్లకు ఒక నిజం తెలుస్తుంది. అతడు బతికే ఉన్నాడని తెలుస్తుంది. చివరకు రాకీని కేజీఎఫ్ నుంచి బయటికి తీసుకొస్తారు. అప్పుడే అధీరా అసలు రూపం చూపిస్తాడు. రాకీని దెబ్బకొడతాడు. కానీ.. రాకీ మాత్రం అధీరా విషయంలో జాగ్రత్త పడి.. వెంటనే దుబాయ్ వెళ్లిపోతాడు.
ఆ తర్వాత రాకీ అక్కడి నుంచి తిరిగి కేజీఎఫ్ కు ఎప్పుడు వస్తాడు? అధీరాను ఎలా ఎదుర్కొన్నాడు? మధ్యలో కేజీఎఫ్ ను లాక్కోవాలని ప్రయత్నించిన ప్రధాన మంత్రిని రాకీ ఎలా ఎదుర్కొంటాడు… అనేదే ఈ సినిమా అసలు కథ.
ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే.. మొదటి పార్ట్ కు ఏమాత్రం తీసిపోకుండా రెండో పార్ట్ ను ప్రశాంత్ తెరకెక్కించాడు. రాకీ బాయ్ గా నటించిన యష్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ పార్ట్ లో స్పెషల్ అట్రాక్షన్ అంటే.. సంజయ్ దత్ అనే చెప్పుకోవాలి.
అధీరగా సంజయ్ దత్ జీవించాడు. రాకీ, అధీర మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోయాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా బాగానే యాక్ట్ చేసింది. ప్రధాన మంత్రిగా రవీనా టాండన్ యాక్ట్ చేసింది. సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్ అదరగొట్టాడు.
సినిమాటోగ్రఫీ
యష్ నటన
అధీర నటన
పోరాట సన్నివేశాలు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం
రవీనా టాండన్ నటన
రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ నటన
సాగదీసిన కథ
యాక్షన్ సీన్స్
సెంటిమెంట్ సీన్స్
తగ్గిన థ్రిల్
వయలెన్స్
రాజకీయ రంగు
కన్ క్లూజన్ : చివరగా చెప్పొచ్చేదేంటంటే.. కేజీఎఫ్ చాప్టర్ వన్ స్టాయిలో ఊహించుకొని మాత్రం సినిమాకు వెళ్లకండి. చాప్టర్ 2 కూడా అదిరిపోయింది కానీ.. చాప్టర్ వన్ లో ఉన్న థ్రిల్ ను అయితే ఇందులో పొందలేరు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.