Hanuman Jayanthi : దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు ఏడాదంతా వేచి చూసేది.. హనుమాన్ జయంతి కోసమే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున హుమాన్ జయంతి పండుగను నిర్వహిస్తుంటారు. అయితే ఇదే రోజున ఆంజనేయ స్వామి జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు శనీశ్వరుడు కూడా మన ఇంటిని వదిలి వెళ్తాడని భక్తుల నమ్మకం. అంతే కాదు దంపతుల మధ్య ఎడబాటు ఉన్నవారు ఒకటవుతారని కూడా విశ్వసిస్తుంటారు. అందుకే హనుమాన్ జయంతి రోజు వేకువ జామునే లేచి ఆలయాలు వెళ్లడం.. ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం.
అయితే ఈ సారి హనుమాన్ జయంతి శరనివారం రోజున రావడంతో మరింత ప్రాముఖ్యత పెరిగింది. చాలా ఏళ్లుగా సమస్యలతో బాధ పడుతున్న వారు, ఇబ్బందులున్న వారు.. ఏవైనా కోరికలు ఉన్న వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ చేసి.. మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. అయితే ముందుగా ఆంజనేయ స్వామి గుడికి వెల్లి దర్శనం చేసుకోవాలి. వాయు పుత్రుడి ముందు దీపం వెలిగించాలి. ఆలయ ప్రాంగణంలోనే కూర్చొని 11సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి కచ్చితంగా ప్రసన్నమవుతాడు. అంతే కాదండోయ్ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన గులాబీ మాల, జిల్లేడు పూల మాలను హనుమాన్ కి సమర్పించాలి.
11 రావి ఆకులను తీస్కొని దానిపై రామ నామం రాసి… స్వామి వారి ముందుంచాలి. అలాగే తమలపాకులను కూడా సమర్పించాలి. సుందర కాడం పఠించడం వల్ల ఆంజనేయ స్వామి కృప మీపై ఉంటుంది.శనిదోషం పోగొట్టుకోవాలి అనుకునే వాళ్లు ఆవ నూనె దీపం వెలిగించడం మంచిది. అలాగే ఈ దీపంలో రెండు లవంగాలు ఉంచి పూజిస్తే మరింత మంచిది. మీ స్తోమతను బట్టి రామాయణం, శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం, సింధూరం, నూనె, తమలపాకులు సమర్పించడం వల్ల ఆంజనేయ స్వామి అమితానందం పొందుతాడు. అలాగే ఆవు నెయ్యితో చేసిన 5 రొట్టెలను నైవేద్యంగా సమర్పించండి. ఆంజనేయ జయంతి నాడు కొబ్బరి కాయ తీస్కొని గుడికి వెళ్లాలి. మీ తలపై కొబ్బరి కాయను పెట్టుకొనిఏడు సార్లు తాకించాలి. అనంతరం కొబ్బరి కాయను దేవుడి గదిలో పగలగొట్టండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతాయి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్‌డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.