Categories: NewsReviews

Laila Movie Review : విశ్వ‌క్ సేన్ లైలా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Laila Movie Review : శుక్ర‌వారం వ‌చ్చిందంటే థియేట‌ర్స్‌లో వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ శుక్ర‌వారం vishwak sen విశ్వ‌క్ సేన్ న‌టించిన లైలా మూవీ కూడా విడుద‌ల కాబోతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం Laila Movie లైలా. ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాస్ కా దాస్  vishwak sen విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. లైలా Laila Movie Review చిత్రం ఫిబ్రవరి 14 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది.

Laila Movie Review : విశ్వ‌క్ సేన్ లైలా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

నటులు: విశ్వక్ సేన్, అభిమన్యు సింగ్, అకంక్షా శర్మ, వినీత్ కుమార్, పృథ్వీ రాజ్,
దర్శకుడు: రామ్ నారాయణ్
సినిమా శైలి: తెలుగు, డ్రామా
వ్యవధి: 2 గంటల 16 నిమిషాలు
రిలీజ్ డేట్ : 14 ఫిబ్ర‌వ‌రి 2025

Laila Movie Review విశ్వ‌క్ సేన్ ఆడవేషంలో స్పెషల్ ఎట్రాక్షన్‌

లైలా చిత్రంలో విశ్వ‌క్ సేన్ ఆడవేషంలో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయిలో అమ్మాయి గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లోని కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచింది. దాంతో లైలాపై మంచి క్రేజ్ ఏర్పడింది.మిక్స్‌డ్ రెస్సాన్స్‌తో ముందుకెళ్తున్న లైలా సినిమా గురించిన రిపోర్టు బయటకు వచ్చింది. లైలా చిత్రంలో విశ్వక్ సేన్ మరోసారి అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన తన పాత్ర ద్వారా అందించిన ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలెట్‌గా ఉందని చెబుతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్‌ రిపోర్ట్ వచ్చింది. సినిమాని వీక్షించిన సెన్సార్‌ బోర్డ్ ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా నిడివి కూడా చాలా తక్కువగానే ఉంది. రెండుగంటల 16 నిమిషాలు(136 నిమిషాలు) మాత్రమే ఉంది. ఇటీవల కాలంలో చాలా సినిమాల లెంన్తీగా ఉంటున్నాయి. మూడు గంటలకు తగ్గడం లేదు. ఈ క్రమంలో లైలా నివిడి చాలా తక్కువగా ఉండటం విశేషం. సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని అర్థమవుతుంది. సెన్సార్‌ రిపోర్ట్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది. అయితే కాస్త బోల్డ్ కంటెంట్ తో ఈ మూవీ రాబోతుందని టీజర్‌, ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. `లైలా`పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగులు ఉన్నాయి. యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది అని అర్థమవుతుంది. ఇటీవల కాలంలో బోల్డ్ డైలాగ్‌లు, బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు లైలా కూడా ఆ కోవకు చెందిన మూవీనే అని తెలుస్తుంది.

Laila Movie Review కథ :

సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండేవాడు. అతని మేకప్ స్కిల్స్‌కి అక్కడ మంచి పేరు ఉంటుంది. ఒక కస్టమర్ కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె భర్త నడిపే వంటనూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్‌గా తన పేరు వినిపించమని చెప్తాడు. కానీ ఈ చిన్న నిర్ణయం సోనును ఓ పెద్ద చిక్కులో పడేస్తుంది. ఆ స‌మ‌యంలో సోను ఎలా లైలాగా మారాడు అనేది సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

Laila Movie Review విశ్లేషణ:

విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలో ‘హిట్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ లాంటి సినిమాలతో తనను మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ లాంటి కమర్షియల్ ఫార్ములాతో ప్రయోగాలు చేయడం అత‌నికి ఏం క‌లిసి రాలేదు. ఇప్పుడు ‘లైలా’ కూడా అదే కోవకు చెందిన సినిమా. కానీ పైన చెప్పిన అన్ని సినిమాలలో కూడా విశ్వక్ నటన ఏ చిత్రంలోను నిరాశపరచలేదు. లైలాలో కూడా అంతే. అతని ఎనర్జీ వల్ల పరమ రొటీన్ కథ కూడా పరవాలేదు అనిపించుకుంది. పాతబస్తీ హాస్యాన్ని, ద్వందార్థ సంభాషణలను ప్రధానంగా మలచడం, కథేమీ లేకుండా అర్థరహిత సన్నివేశాలు నింపడం సినిమాను ఆసక్తికరం కానీయకుండా చేసింది. హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అసలు పనిచేయలేదు. అలాగే, క్లైమాక్స్ పూర్తిగా నిరాశపరిచింది. మొదటి హాఫ్ పర్వాలేదు అనిపించుకున్న సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది…

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago