Vishwak Sen : పృథ్వీ చేసిన ప‌నికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishwak Sen : పృథ్వీ చేసిన ప‌నికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 February 2025,5:18 pm

ప్రధానాంశాలు:

  •  Vishwak Sen : పృథ్వీ చేసిన ప‌నికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..!

Vishwak Sen : విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం లైలా Laila Movie . ఈ నెల 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఊహించని షాక్ త‌గిలింది. మూవీ వేడుక‌కి సంబంధించి జ‌రిగిన ఈవెంట్‌లో actor prudhvi raj  పృథ్వి మాట్లాడుతూ ఒక సందర్భంలో 150 మేకలు 11 అవుతాయని కామెంట్స్ చేశాడు. దాంతో వైసీపీ నాయకులు ఆ సినిమాపై తిరగబడుతున్నారు. actor prudhvi raj పృథ్వి వ్యాఖ్యలకు నిరసనగా బైకాట్ లైలా Boycott Laila  అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాంతో లైలా మేకర్స్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి.. పృథ్వి వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

Vishwak Sen పృథ్వీ చేసిన ప‌నికి సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్

Vishwak Sen : పృథ్వీ చేసిన ప‌నికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..!

Vishwak Sen దిగొచ్చిన విశ్వ‌క్ సేన్..

మా ఈవెంట్ లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా..పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా ? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడాడు మా కంట్రోల్ లో జరుగలేదు. చాలా కష్టపడి సినిమా తీశాము.నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.

మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు. రాజకీయాలు మాట్లాడేంత అనుభవం తనకు లేదు. ఒకరి మీద కోపంతో సినిమాను చంపేయొద్దంటూ విశ్వక్ సేన్ వేడుకున్నాడు.పృథ్వి చేసిన దానికి తమ సినిమాను బ్యాన్ చేయాలనడం సరైంది కాదంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమాకు మీ అందరి సపోర్టు కావాలని విశ్వక్ సేన్ కోరారు. విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది