Laila Movie Review : విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Laila movie Review : విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Laila Movie Review : శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్‌లో వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ శుక్రవారం vishwak sen విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ కూడా విడుదల కాబోతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం Laila Movie లైలా. ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాస్ కా దాస్ vishwak sen విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. లైలా Laila Movie Review చిత్రం ఫిబ్రవరి 14 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది.
![Laila Movie Review విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Laila-Movie-Review.jpg)
Laila Movie Review : విశ్వక్ సేన్ లైలా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
నటులు: విశ్వక్ సేన్, అభిమన్యు సింగ్, అకంక్షా శర్మ, వినీత్ కుమార్, పృథ్వీ రాజ్,
దర్శకుడు: రామ్ నారాయణ్
సినిమా శైలి: తెలుగు, డ్రామా
వ్యవధి: 2 గంటల 16 నిమిషాలు
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2025
Laila Movie Review విశ్వక్ సేన్ ఆడవేషంలో స్పెషల్ ఎట్రాక్షన్
లైలా చిత్రంలో విశ్వక్ సేన్ ఆడవేషంలో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయిలో అమ్మాయి గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లోని కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచింది. దాంతో లైలాపై మంచి క్రేజ్ ఏర్పడింది.మిక్స్‌డ్ రెస్సాన్స్‌తో ముందుకెళ్తున్న లైలా సినిమా గురించిన రిపోర్టు బయటకు వచ్చింది. లైలా చిత్రంలో విశ్వక్ సేన్ మరోసారి అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన తన పాత్ర ద్వారా అందించిన ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలెట్‌గా ఉందని చెబుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా నిడివి కూడా చాలా తక్కువగానే ఉంది. రెండుగంటల 16 నిమిషాలు(136 నిమిషాలు) మాత్రమే ఉంది. ఇటీవల కాలంలో చాలా సినిమాల లెంన్తీగా ఉంటున్నాయి. మూడు గంటలకు తగ్గడం లేదు. ఈ క్రమంలో లైలా నివిడి చాలా తక్కువగా ఉండటం విశేషం. సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని అర్థమవుతుంది. సెన్సార్ రిపోర్ట్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది. అయితే కాస్త బోల్డ్ కంటెంట్ తో ఈ మూవీ రాబోతుందని టీజర్, ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. `లైలా`పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగులు ఉన్నాయి.
యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది అని అర్థమవుతుంది. ఇటీవల కాలంలో బోల్డ్ డైలాగ్‌లు, బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు లైలా కూడా ఆ కోవకు చెందిన మూవీనే అని తెలుస్తుంది. ఈ మూవీ పూర్తి రివ్యూ కోసం సైట్‌ని ఫాలో అవుతూ ఉండండి.