Maa Oori Polimera 2 Review : ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maa Oori Polimera 2 Review : ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Maa Oori Polimera 2 Review : మీకు గుర్తుందా? 2021 లో హాట్ స్టార్ యాప్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర సినిమా గుర్తుందా? ఓటీటీలో రిలీజ్ అయింది కదా.. ఈ సినిమాలో ఏం దమ్ము ఉంటుంది అని అనుకున్నారు అంతా. కానీ.. ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద సంచలనాలనే సృష్టించింది. సత్యం రాజేశ్, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 November 2023,3:00 am

ప్రధానాంశాలు:

  •  మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అదిరిపోనుందా?

  •  రెండో పార్ట్ కథ ఇదేనా

  •  మొదటి పార్ట్ లోని ట్విస్టులకు రెండో పార్ట్ సినిమాలో సమాధానం

Cast & Crew

  • Hero : సత్యం రాజేష్(Satyam Rajesh)
  • Heroine : కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla)
  • Cast : బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితీ దాసరి, రవివర్మ
  • Director : అనిల్ విశ్వనాథ్
  • Producer : గౌరీ కృష్ణ
  • Music :
  • Cinematography : కుషేందర్ రమేష్ రెడ్డి

Maa Oori Polimera 2 Review : మీకు గుర్తుందా? 2021 లో హాట్ స్టార్ యాప్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర సినిమా గుర్తుందా? ఓటీటీలో రిలీజ్ అయింది కదా.. ఈ సినిమాలో ఏం దమ్ము ఉంటుంది అని అనుకున్నారు అంతా. కానీ.. ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద సంచలనాలనే సృష్టించింది. సత్యం రాజేశ్, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆ సినిమాకు రెండో పార్ట్ కూడా తీస్తారని అప్పుడే ప్రకటించారు. కానీ.. రెండో పార్ట్ తీయడానికి రెండేళ్ల సమయం పట్టింది. నిజానికి ఆ సినిమాలో క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. దీంతో రెండో పార్ట్ ఎప్పుడొస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. చివరకు మా ఊరి పొలిమేర 2 పేరుతో ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో నవంబర్ 3న అంటే ఈరోజు ఈ సినిమా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పడ్డాయి.

ఈ సినిమా తొలి పార్ట్ కు కంటిన్యూ కావడం వల్ల.. తొలి భాగంలో ఎవరైతే నటించారో వాళ్లే రెండో పార్ట్ లోనూ నటించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా.. ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. గౌరీ కృష్ణ నిర్మాత. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. తొలి పార్ట్ లో క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులకు వివరణ.. రెండో పార్ట్ లో ఉంటుంది. ఇక.. ఈ సినిమాలో నటించిన సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శీను అయితే ఇరగదీశారు. తమ పాత్రల్లో జీవించేశారు. ఈ సినిమాలో సత్యం రాజేష్ ది ముఖ్యమైన పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే సత్యం రాజేష్ ఈ సినిమాకు హీరో అని చెప్పుకోవాలి. మరి.. రెండో పార్ట్ కూడా ప్రేక్షకులను అలరించిందా? ఇంతకీ రెండో పార్ట్ కథ ఏంటో తెలుసుకుందాం రండి.

Maa Oori Polimera 2 Review : కథ

కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కలిసి కేరళకు పారిపోతాడు. అప్పటికే అడ్రాసుపల్లిలో వరుస హత్యలు జరుగుతాయి. ఇంతలో కొమురయ్య తమ్ముడు జంగయ్య కనిపించకుండా పోతాడు. అయితే.. ఇదంతా మూఢనమ్మకాల నేపథ్యంలో సాగుతుండగా.. కథ ఒక్కసారిగా నిధి వైపు మళ్లుతుంది. చాలా విలువైన నిధి కోసమే కొమురయ్య ఈ నాటకం ఆడుతాడని తెలుస్తుంది. అసలు అడ్రాసుపల్లిలో నిధి ఎక్కడుంది.. అక్కడున్న చీకటి రాజ్యం ఏంటి? ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు ఆ నిధి ఎక్కడుందో తెలుస్తుందా? అనేదే ఈ సినిమా కథ.

Maa Oori Polimera 2 Review : విశ్లేషణ

ఇక.. ఈ సినిమాలో ఒక్కొక్కరు ఒక్కో డైమండ్. అందరి నటన అదుర్స్. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ లో ఇరగదీశారు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న ట్విస్టులకు ఈ పార్ట్ లో ఆన్సర్ దొరుకుతుంది. మొత్తానికి సత్యం రాజేష్ ఈ సినిమాతో కమెడియన్ గానే కాదు.. అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోగలడని అర్థం అవుతుంది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే మా ఊరి పొలిమేర పార్ట్ వన్ కు రీక్యాప్ లా ఉంటుంది. అంటే.. మొదటి పార్ట్ చూడని వాళ్లు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడా కథ అర్థం కానట్టుగా ఏం ఉండదు. మా పొలిమేర రీక్యాప్ తర్వాత ఇంటర్వెల్ కు ముందు ఇక కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తాయి. ఆ సీన్లు బాగుంటాయి. ఇక ఇంటర్వెల్ సీన్ కూడా సూపర్ గా ఉంటుంది. సెకండాఫ్ అద్భుతం. ఇక.. ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు చూసి షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ట్విస్టులు మామూలుగా ఉండవు. ఒక్కో ట్విస్ట్ వస్తున్న కొద్దీ ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని మరీ స్క్రీన్ ను చూస్తుంటారు. అలాగే.. ఈ సినిమా మూడో పార్ట్ కూడా ఉంటుందని క్లైమాక్స్ లో మరో హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇక.. ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్.. నెరేషన్. సినిమా డైరెక్షన్ కూడా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అనే చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్

ఎక్సలెంట్ సెకండాఫ్

నెరేషన్

బీజీఎం

ట్విస్టులు

మైనస్ పాయింట్స్

స్లో క్లైమాక్స్

Rating :

2.75/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది