Pushpa Saami Saami Song Review : తగ్గేదే లే.. సుకుమార్ మార్క్ ‘సామీ సామీ’ సాంగ్..!
Pushpa Saami Saami Song Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’నుంచి ఇటీవల విడుదలైన థర్డ్ సింగిల్ ‘సామీ సామీ’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయగా, పాట జానపద శైలిలో అందరినీ అలరిస్తోంది.తెలంగాణ శైలిలో దేవీ శ్రీప్రసాద్ కంపోజిషన్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి. ‘నువ్ అమ్మీ అమ్మీ అంటుంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. సామీ..’అనే పాట కంపోజిషన్‌లో తెలంగాణ జానపద శైలి కొట్టొచ్చినట్లు కనబడుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ పాటను ఆలపించిన సింగర్ తెలంగాణ జానపద గాయని మౌనిక యాదవ్ కావడం విశేషం. ఆమె గొంతు నుంచి వచ్చిన ఈ పాట ఎందరో మనసుల్లోకి వెళ్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే, తెలంగాణ యాస, బీట్ పట్టుకోవడంలో దేవీశ్రీప్రసాద్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో ‘ఆగట్టునుంటావా.. నాగన్న.. ఈ గట్టునుంటావా నాగన్న’ సాంగ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. కాగా, ఇప్పుడు ‘సామీ సామీ’ సాంగ్ కూడా జనాలకు బాగా నచ్చేలా ఉంది. ఈ సాంగ్ తెలంగాణ జానపద గాయని మౌనిక యాదవ్ ఆలపించడంతో ఈ పాట ఇంకా జనాలకు ఎక్కువగా నచ్చుతున్నది.
Pushpa Saami Saami Song Review : క్యాచీ లిరిక్స్..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో మౌనిక యాదవ్ పాడిన పాటలు ఉత్తేజం నింపిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆమె గొంతు నుంచి వచ్చిన ఈ సినీ గీతం ప్రజలను ఉర్రూతలూగించేలాగా ఉంది. ఇక ఈ పాటకు తెలంగాణ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అవి క్యాచీగా ఉండటంతో పాటు వినసొంపుగా ఉన్నాయి. మౌనిక యాదవ్ స్పష్టమైన పదాల ఉచ్ఛరణ, దేవీ శ్రీప్రసాద్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ బాగుందని అందరూ అంటున్నారు.