RRR Movie Review : ‘ఆర్ఆర్ఆర్’పై మరో రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ దా? చరణ్‌దా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :14 January 2022,1:30 pm

RRR Movie Review : టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ గ్రాండియర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో వాయిదా పడిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఈ సినిమాపై గతంలోనే ఫస్ట్ రివ్యూ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ పిక్చర్ గురించి మరో రివ్యూ వచ్చేసింది.మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఈ పిక్చర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నదని వార్తలొస్తున్నాయి.

ఈ సంగతులు అలా ఉంచితే తాజాగా ఉమైర్ సంధు అనే స్వయం ప్రకటిత సెన్సార్ బోర్డు మెంబర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై మరోసారి రివ్యూ ఇచ్చారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కంటే కూడా మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని పేర్కొన్నాడు.ఉమైర్ సంధు గతంలో కొన్ని ఫ్లాప్ చిత్రాలకు కూడా సక్సెస్ అవుతాయని రివ్యూ ఇచ్చాడు. కాగా, ఈ సినిమా డెఫినెట్ సక్సెస్ వెనుక రాజమౌళి ఉంటాడని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చి ఉంటుందని రామ్ చరణ్ , తారక్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

RRR Movie Review by umair sandhu

RRR Movie Review by umair sandhu

RRR Movie Review : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. పిక్చర్‌కు ఇచ్చిన సర్టిఫికెట్ ఇదే…

ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించగా, తారక్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా నటించింది. చిత్రంలో మన్యం వీరుడిగా చెర్రీ కనిపించనుండగా, గిరిజన యోధుడు కొమురం భీంగా తారక్ నటించారు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, స్టోరిని విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ ఎం.ఎం.కీరవాణి అందించారు. సముద్రఖని, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలు అయిపోతారని తెలుగు సినీ అభిమానులు అంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి