RRR Movie Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేపటి తరానికి క్లాసిక్ అంటూ ట్వీట్..!
RRR Movie Review : కొన్నాళ్లుగా సినిమా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మూవీ మేనియానే కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ట్రిపుల్ ఆర్ మూవీపై అభిమానులే కాకుండా సాధారణ ఆడియెన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఓవైపు ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు తమ ప్రేమను చాటుకుంటున్నారు.
RRR Movie Review : ఆర్ఆర్ఆర్‌పై అమాంతం పెరిగిన అంచనాలు
ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉండగా, తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చాడో సినీ విమర్శకుడు. ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సినిమా రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్ చూసేశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు.ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ బొనంజా ఖాయమని.. భారతీయ ఫిలింమేకర్ సత్తాకు నిదర్శనమే రౌద్రం రణం రుదిరం అని తెలిపారు. పెద్ద పెద్ద కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునే దిశలో నడవడం తో పాటు అందరూ గర్వపడేలా ఈ సినిమా రాజమౌళి తీశారు రు ఈ చిత్రాన్ని చూడటం ఎవ్వరూ మిస్ అవ్వకండి.
ఈ సినిమాని చూసి తీరాల్సిందే! ఇప్పుడు దీన్ని బ్లాక్‌బస్టర్ అని చెప్పుకున్నా రేపటి తరానికి మాత్రం ఇదొక క్లాసిక్‌గా మిగిలిపోతుంది. చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్ అదిరింది. అజయ్ దేవ్‌గణ్ ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఆలియా భట్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు గుండెకాయ లాంటి వాడని.. రామ్ చరణ్ సమ్మోహితులను చేశాడానికి తెలిపారు. తారక్ రామ్ డెడ్లీ కాంబో అని ఉమైర్ సంధు ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్రంతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్‌గా మారిపోతాడంటూ ఉమైర్ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్ చేశాడు.